సన్నాలు.. కొన్నాళ్లేనా..!


ఈ నెల 9న.. జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ బేల మండలం టాక్లీ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చే సి.. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. ఆ సమయంలో పాఠశాలలో సన్నబియ్యానికి బదు లు దొడ్డుబియ్యమే ఉంది. దీనిపై ఆ పాఠశాల హెచ్‌ఎం రాంచందర్‌ను ప్రశ్నిస్తే.. 10 కిలోల సన్నబియ్యం నిర్వాహకురాలి ఇంటి వద్దే ఉందని.. అక్కడే వండి తీసుకొస్తుందని పొంతన లేని సమాధానమిచ్చారు. దీంతో జేసీ సదరు హెచ్‌ఎంకు మెమో జారీ చేస్తామని చెప్పారు. అధికారులు మిగతా స్కూళ్లు.. హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తే ఇలాంటి అక్రమాలు.. అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

 

 సాక్షి, మంచిర్యాల : సర్కారుకు సన్న బియ్యం భారమైందా..? మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు సన్నబియ్యం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుందా..? విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం దొడ్డు బియ్యంతోనే చేసిందా..? లేక నాణ్యమైన సన్నబియ్యం అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందా..? ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న మధ్యాహ్నం భోజనం పథకం తీరును పరిశీలిస్తే ఈ ప్రశ్నలు తలెత్తక మానదు..! గత విద్యా సంవత్సరం ఫిబ్రవరి నుంచి ముగింపు వరకు విద్యార్థులకు అందిన నాణ్యమైన సన్నబియ్యం.. ఇప్పుడు జిల్లాలో వేలాది పాఠశాలలు.. హాస్టళ్లలో కానరావడం లేదు.



పాఠశాలల పునఃప్రారంభం నుంచి విద్యార్థులకు రీ సైక్లింగ్ చేసిన దొడ్డుబియ్యమే సంఫరా చేస్తున్నారని ఇటు హెచ్‌ఎంలు, అటు మధ్యాహ్నం భో జన నిర్వాహకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎం త జాగ్రత్తగా వండినా.. అన్నం ముద్దగా అవుతోందని వంట మనుషులు తల పట్టుకుంటున్నారు. అన్నం ము ద్దగా ఉండడంతో కడుపు తీరా తినలేకపోతున్నామని విద్యార్థులూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం కొత్త బియ్యం కావడంతో అన్నం మెత్తబడుతోందని చెప్పుకొస్తున్నారు. అయితే పథకం ప్రారంభం లో లేని సమస్య ఇప్పుడెందుకు వస్తుందనే ప్రశ్న తలె త్తుతోంది. ఇదిలావుంటే.. పలు చోట్ల సన్నబియ్యంలో దొడ్డుబియ్యం కలుపుతున్నారనే ఆరోపణలున్నాయి.



 3.42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..

 జిల్లా పరిధిలోని 3,850 పాఠశాలలు.. 52 కేజీబీవీలు, 112 వసతి గృహాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో చదువుతున్న 3.42 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యం అందజేస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 100 గ్రాముల బియ్యం, 6-10 విద్యార్థులకు 150 గ్రాములు, వసతి గృహాల విద్యార్థులకు రో జుకు 425 గ్రాముల చొప్పున బియ్యం అందిస్తోంది. రూ.34కు కిలో చొప్పున 1800 మెట్రిక్ టన్నుల సన్నబి య్యాన్ని కొనుగోలు చేసి.. జిల్లా, మండల లెవల్ స్టాకిస్ట్ పాయింట్ల ద్వారా డీలర్లకు.. అక్కడి నుంచి ప్ర భుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తోంది.



బ్యాగుపై ఎం ఎండీ(మిడ్ డే మీల్స్) అనే ముద్రతో.. ప్యాకింగ్ తేడా తో ఈ బియ్యం అందజేస్తోంది. అయితే.. డీలర్ల నుంచి వస్తున్న బియ్యం సన్నగా కనిపించినా.. వండిన తర్వా త ముద్దవుతోంది. కొత్త బియ్యం కావొచ్చని జాగ్రత్తగా వండినా అలాగే అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. చాలా చోట్ల రీసైక్లింగ్ చేసిన దొడ్డుబియ్యమే సరఫరా అవుతోందని హెచ్‌ఎంలు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top