ఏపీకి సహకరిస్తాం

ఏపీకి సహకరిస్తాం - Sakshi

  •  సీఎం చంద్రబాబు బృందానికి జపాన్ ప్రధాని షింజో అబే హామీ

  •  రాజధాని నిర్మాణం, అభివృద్ధిలో పాలుపంచుకుంటామని వెల్లడి

  •  ఏపీలో ఉన్న అవకాశాలు, జపాన్ పెట్టుబడులు మంచి జోడీ అని బాబు వ్యాఖ్య

  •  జపాన్ ప్రధానిని సత్కరించి, తిరుమల వెంకన్న ప్రసాదాన్ని అందజేసిన సీఎం

  •  జపాన్ ప్రభుత్వం, సంస్థలతో అవగాహన ఒప్పందాలు

  •  నేటి రాత్రి 12.30కి హైదరాబాద్‌కు రాక

  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని షింజో అబే హామీ ఇచ్చారు. నూతన రాజధాని నిర్మాణం, అభివృద్ధిలో పాలుపంచుకుంటామని జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి హామీ ఇచ్చారు. చంద్రబాబు బృందం శుక్రవారం జపాన్ ప్రధాని అబేతో టోక్యోలోని ఆయన కార్యాలయంలో సమావేశమైంది.



    ఈ సందర్భంగా అబే మాట్లాడుతూ దౌత్య సంబంధాలతో పాటు వర్తక, వాణిజ్యంలో భారత్ తమకు ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, జపాన్‌ల మధ్య పరస్పర సహకారం వృద్ధి చెందుతుందన్నారు. భారత ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజుల వ్యవధిలోనే జపాన్‌ను సందర్శించడం గొప్ప పరిణామమని అభివర్ణించారు. అంతకుముందు చంద్రబాబు తన ఐదు రోజుల పర్యటనను అబేకు వివరించారు.



    ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ఏపీలో ఉన్న అవకాశాలు, జపాన్ పెట్టుబడులు మంచి జోడీ అని అభివర్థించారు. కొత్త రాష్ట్రంతో పాటు, రాజధాని అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీని సంద ర్శించాలని అబేను చంద్రబాబు ఆహ్వానించారు. జపాన్ ప్రధాని అబే ను శాలువతో సత్కరించి జ్ఞాపికను, తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అందచేశారు. శనివారం ఉదయం చంద్రబాబు టోక్యో నగరంలోని తెలుగువారితో సమావేశమవనున్నారు.  



    అనంతరం బాబు బృందం భారత్‌కు బయల్దేరి, రాత్రి 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. జపాన్ ప్రధానితో భేటీ అయిన వారిలో మంత్రులు యనమల, పి. నారాయణ,  ఎంపీలు గల్లా జయదేవ్, సి.ఎం. రమేష్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి  కంభంపాటి రామ్మోహనరావు, పరకాల ప్రభాకర్, జపాన్‌లో భారత రాయబారి దీపా గోపాలన్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉన్నారు.

     

    పలు అవగాహన ఒప్పందాలు



    జపాన్ ప్రభుత్వం, కంపెనీలతో బాబు బృందం 6 ఒప్పందాలు కుదుర్చున్నట్లు హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం తెలిపింది.

     

    ఒప్పందాలివీ..



    హాజపాన్ ప్రభుత్వ ఆర్థిక, వ్యాపార, వాణిజ్య మంత్రిత్వ శాఖ (ఎంఈటీఐ)తో  ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్, జపాన్ ట్రేడ్ పాలసీ బ్యూరో డెరైక్టర్ జనరల్ హైడో సుజుకి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జపాన్ ఆర్థిక, వ్యాపార, వాణి జ్య మంత్రి యోచి మియజవా పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని జపాన్ నుంచి అందించేందుకు వర్కిం గ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడం ఈ ఒప్పం దంలో ముఖ్యాంశం. ఈ గ్రూప్‌లో భారత్‌లోని జపాన్ రాయబార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం, న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (నెడో), జపాన్ బ్యాంక్ ఫర్  ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జెబీఐసీ), జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెఈటీఆర్‌వో), జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జె ఐసీఏ)లు సభ్యత్వం కలిగి ఉంటాయి. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ రం గాలకు ప్రాధాన్యతనిస్తారు. జపాన్ పారిశ్రామిక పార్కుల ఏర్పాటును కూడా ఎంఈటీఐ ప్రోత్సహిస్తుంది. జపాన్ సంస్థలను ప్రోత్సహించేందుకు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు మంచి వాతావరణం కల్పిస్తామని,  ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

     

    హాపరస్పరం ఆసక్తి ఉన్న అంశాల్లో అవకాశాలను వెలికితీయటం, సహకారానికి నెడో, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది.  స్మార్ట్ కమ్యూనిటీ (స్మార్ట్ నగరాలు) ఏర్పాటుతో పాటు అక్కడ వివిధ కార్యకలాపాలు, జపాన్‌లో ఈ రంగంలో విజయగాథలపై నెడో ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి, అభిప్రాయాలను పంచుకుంటుంది. సోలార్, బయోమాస్, గాలిమరల ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో సహకారం, ఇంధన సామర్ధ్యం, నిల్వలకు ఉన్న అవకాశాలను గుర్తిస్తాయి.

     

    హాకొబె స్టీల్ గ్రూప్, కొబెల్కో  క్రేన్స్, శ్రీ సిటీల మధ్య కూడా ఒప్పందం కుదిరింది.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top