ఆంధ్ర తొత్తుగా మారిన జానారెడ్డి

ఆంధ్ర తొత్తుగా మారిన జానారెడ్డి - Sakshi


 నల్లగొండ రూరల్ : సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఆంధ్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని రాష్ట్ర విద్యాశాఖ మం త్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపిం చారు. మంగళవారం ఆయన నల్లగొండలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

 

 తెలంగాణను ఇబ్బంది పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్, పోలవరం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సమస్యలు సృష్టిస్తుంటే జానారెడ్డి ఏనా డు నోరు విప్పలేదన్నారు. రాజకీయ భవిష్యత్, పదవుల వ్యామోహం తప్ప ఆయనకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. జానారెడ్డి  ప్రా తినిధ్యం వహిస్తున్న సాగర్ నియోజకవర్గానికి కూడా చేసింది ఏమీ లేదన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను సిద్ధం చేసిందని, వీటిని దసరా, దీపావళి నుంచి ప్రారంభించనున్నారని చెప్పారు.

 

 ఇందులో రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, దళితు ల భూ పంపిణీ, ధనలక్ష్మి, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు తదితర పథకాలు ఉన్నాయని తెలిపారు. మునగాల ప్రాంత ప్రజలు కూడా తెలంగాణ వారేనని, మన విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమే ‘పాస్ట్’ను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహా రెడ్డి, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, రేఖల భద్రాద్రి, జమీల్, బక్క పిచ్చ య్య, చింత శివరామకృష్ణ, అయ్యడపు ప్రకాశ్‌రెడ్డి, రవినాయక్, నాగార్జున, శోభన్‌బాబుు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top