నేటి నుంచి ‘జన-ధన యోజన’


జడ్చర్ల: పేద కు టుంబాలు బ్యాం కు ఖాతా తెరువాలంటే వ్యయంతో కూడినపని. దీనికితోడు సంబంధిత ధ్రువీకరణపత్రా లు లేకపోవడం, అధికారుల సవాలక్ష ప్రశ్నలకు సా మాన్యులు బ్యాం కు మెట్లు ఎక్కాలంటేనే వెనుకడగు వేసే పరిస్థితి. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన జన-ధన యోజన కార్యక్రమం ద్వారా ఆ ఇబ్బందులుఇక తొలగిపోనున్నాయి. ఈ పథకం దేశవ్యాప్తంగా గురువారంనుంచి అమల్లోకి రానుంది.    

 

జీరో బ్యాలెన్స్‌తో ఖాతా


జీరో బ్యాలెన్స్‌తో ఖాతాను తెరువవచ్చు. కనీస డిపాజిట్ చేయనవసరం లేదు. ఈ ఖాతాలో ఎప్పుడైనా సొమ్మును జమ చేసుకోవడం, అవసరానికి తగిన విధంగా వాడుకోవచ్చు. దీంతో పొదుపును అలవాటు చేసుకునే పరిస్థితి ఉం టుంది. పొదుపుపై వడ్డీ కూడా లభిస్తుంది. బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడానికి కాలపరిమితి డిపాజిట్‌లను కూడా పొందవచ్చు.

   

ఈ ఖాతా ద్వారా ఏటీఎం సేవలను కూడా పొందవచ్చు. ఈ కార్డు పొందిన వారు ఒక లక్ష రూపాయల వరకు ప్రమాద బీమాసౌకర్యం ఉంటుంది. అంతేగాకుండా ఆర్‌డీ, కిసాన్ క్రెడిట్ కార్డు, పంట రుణాలు, ట్రాక్లర్లు, వ్యవసాయ యంత్రాలు తదితర సౌకర్యాలను పొందవచ్చు.

   

ఖాతా తెరిచిన తరువాత ఆరునెలల పాటు సక్రమంగా నిర్వహిస్తే బ్యాంకు రూ.వేయి పరిమితితో ఓవర్‌డ్రాఫ్టు సౌకర్యం కల్పిస్తుంది. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే రుణ పరిమితినిరూ.5వేలకు పెంచే పరిస్థి తి ఉంది. ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి ప్రభు త్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును నేరుగా ఈ ఖాతాకు జమచేసే సదుపాయం ఉంది.

   

ఆధార్‌కార్డు, ఓటరుకార్డు, రేషన్‌కార్డు, డ్రైవింగ్‌లెసైన్స్, కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లులో ఏదైనా ఒకటి, సర్పంచ్ లేదా ఇతర ప్రజాప్రతినిధి జారీచేసిన ధ్రువీకరణపత్రం ద్వారా ఖాతాను ప్రారంభించవచ్చు. దీనికి సం బంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశామని ఆంధ్రాబ్యాంక్ జడ్చర్ల మేనేజర్ రవిప్రసాద్‌రావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top