నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వట్లేదు

నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వట్లేదు - Sakshi


హైకోర్టులో కోదండరాం పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి అనుమతివ్వా లని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు అనుమతివ్వట్లేదంటూ టీజేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. శాంతియుతంగా ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వట్లేదని, తమ ర్యాలీకి అనుమతి చ్చేలా ఆదేశించాలని కోరుతూ టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నగర పోలీసు కమిషనర్, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదు లుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయ మూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు సోమ వారం విచారణ జరపనున్నారు.



ప్రభుత్వంలో చలనం కోసమే...

‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం గా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు టీ జేఏసీ... సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్, తెలంగాణ మార్చ్, నిరా హార దీక్షలు, రాస్తారో కోలు నిర్వహించింది. తాజాగా మేం లేవనెత్తిన అంశం చాలా కీలకమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగం అభివృద్ధి నిరోధకంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వ ఉదాసీనత మా దృష్టికి వచ్చింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చేందుకు, ఉపాధి అవకాశాల కల్పన కు కార్యచరణ అవసరం.


అందులో భాగం గానే ఈ నెల 22న ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించి అనుమతి కోసం చిక్కడపల్లి పోలీసులకు ఈ నెల 1న దరఖాస్తు చేసు కు న్నాం. శాంతిభద్రతల సమస్య తలెత్తకుం డా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాం. 15న మరోసారి అనుమతి కోరాం. అయినా అనుమతివ్వలేదు. రాజ్యాంగం ప్రకారం సం క్రమించిన హక్కును ఉపయో గించుకునేం దుకే అనుమతి కోరుతున్నాం’ అని కోదండ రాం, వెంకట్‌రెడ్డి కోర్టును కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top