ఫ్లోరిన్ సమస్యను పారదోలేందుకే వాటర్‌గ్రిడ్


 సూర్యాపేట : జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరిన్ సమస్యను పారదోలేందుకే వాటర్‌గ్రిడ్ పథకానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలోని సూర్యాపేటలో గల రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో రెండు లక్షల మంది ఫ్లోరైడ్‌తో  బాధపడుతూ ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని చెప్పారు. దామరచర్ల వద్ద ఏడు వేల మెగా వాట్ల విద్యుదుత్పాదన కేంద్రం ఏర్పాటుకానుందని తెలిపారు. దీంతో ఇక జిల్లాలో కరెంటు సమస్య తీరనుందన్నారు. కళ్ల ముందు ఐదేళ్ల పదవీ కాలం ఉన్నా  భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మూడున్నరేళ్లలో ప్రతి ఇంటికి నీళ్లు రప్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చేందుకు రెయింబవళ్లు కష్టపడుతున్నట్లు స్పష్టం చేశారు.

 

 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్లందిస్తామని, సిద్ధిపేటలో గత 18 ఏళ్ల కిందటే ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేస్తామన్నారు. మీడియా సహకరించి.. తగిన సూచనలు చేయాలని.. ఆ సూచనలను మేం పాటిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళ్లికప్రకాష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు వై.వెంకటేశ్వర్లు, శనగాని రాంబాబుగౌడ్,  మొరిశెట్టి శ్రీనివాస్, నాతి సవీందర్, తూడి నర్సింహ్మరావు, ఆకుల లవకుశ, గాజుల రాంబాయమ్మ, శ్రీవిద్య, రాధిక, ఎల్గూరి రమాకిరణ్‌గౌడ్, నల్లపాటి అప్పారావు, అనిల్‌రెడ్డి, పాండు, హరీష్‌రెడ్డి  తదితరులు ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top