దోపిడీ ప్రవాహం


భారీ నీటి పారుదల శాఖలో అద్దె వాహనాల దందా

 


క్షేత్ర పర్యటనకు వెళ్లకుండానే ఏటా రూ.3.30 కోట్లు డ్రా

{పయాణ భత్యం పేరిట మరో రూ.12 కోట్లు తీసుకుంటున్న ఇంజనీర్లు

‘భారతీయుడు’ లేఖతో  విచారణకు సీఎంఓ ఆదేశం

తప్పించుకునేందుకు  అధికారుల యత్నాలు


 

వరంగల్ :  పంట పొలాలకు నీరందించడంలో విఫలమైన భారీ నీటి పారుదల శాఖలో వాహనాల అద్దె, ప్రయూణ భత్యం పేరిట దోపిడీ ప్రవాహం మాత్రం యథేచ్చగా సాగుతోంది. చింతగట్టు క్యాంపులో ఉన్న భారీ నీటిపారుదల శాఖ కార్యాలయూల పరిధిలో  జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజ్-1 సర్కిల్, స్టేజ్-2 సర్కిల్, సీసీహెచ్ సర్కిల్, క్వాలిటీ కంట్రోల్ సర్కిళ్లు ఉన్నారుు. ఇక్కడి సర్కిళ్ల పరిధిలో 25డివిజన్లు, 76సబ్ డివిజన్లు ఉండగా.. డివిజన్ కార్యాల యాల్లో పనిచేస్తున్న ఈఈలు ఒక్కో వాహనం, సబ్‌డివిజన్ల పరిధిలోని డీఈఈ, ఏఈఈలు కలి పి మొత్తం 110 వాహనాలు అద్దె రూపేణా విని యోగించుకుంటున్నారు. 110 వాహనాలు విని యోగిస్తున్నట్లు లెక్కల్లో ఉన్నా.. కొన్నింటినే వా డుకుంటూ మొత్తం వాహనాల పేరిట బిల్లులు డ్రా చేస్తున్నారు. ఇంతేకాకుండా.. పనులు జరిగే ప్రాంతాలకు వెళ్లకున్నా ప్రయాణ భత్యాల రూపంలో ప్రతి నెల రూ.లక్షల్లో తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నారుు. ఈ దోపిడీని జీర్ణిం చుకోలేని ఒక ఉద్యోగి ‘భారతీయుడు’ పేరిట ఏకంగా సీఎం కార్యాలయానికి లేఖ రాశాడు. ఈ లేఖతో స్పందించిన సీఎంఓ పూర్తిస్థారుులో విచారణకు సంబంధిత శాఖ ఈఎన్‌సీని ఆదేశిం చింది. అరుుతే, అదే శాఖ అధికారులతో విచారణ చేరుుస్తుండడంతో.. పారదర్శకంగా సాగ డం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.



తిరగని కిలోమీటర్లకు బిల్లులు

నాలుగు ప్రధాన శాఖల్లో ఉన్న 110 వాహనాలకు నెల ఒక్కంటికి రూ.25వేల చొ ప్పున ప్రభుత్వం అద్దెగా చెల్లిస్తోంది. కొందరు ఇంజనీర్లు తమ సొంత, బంధువుల వాహనాలను అద్దె రూపంలో వాడుకుంటున్నట్లు తప్పుడు బిల్లులు సమర్పించి లక్ష ల్లో స్వాహా చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ వాహనం నెలకు 2500 కిలోమీటర్లు తిరిగితేనే ప్రభుత్వం నుంచి రూ.25వేల అద్దె వస్తుంది. అరుుతే, కొందరు వారానికోసారి పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి, 30రోజులు తిరిగినట్లు బిల్లు లు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొం దరు ఇంజనీర్లు కార్లను అద్దెకు తిప్పుతూ అటు అద్దె, ఎలాగూ 2500 కిలోమీటర్లు తిరుగుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి బిల్లు ఇలా రెండింటినీ జేబులో వేసుకుంటున్నారు.



అద్దె, భత్యం పేరిట లక్షల్లో స్వాహా

ఇంజనీర్లు 110వాహనాలు వినియోగించుకుంటున్నట్లు బిల్లులు సమర్పించడంతో ప్రతినెలా సుమారు రూ.30లక్షలు అద్దె, ప్రయాణ భత్యం రూపంలో ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నా రుు. ఇదే కాకుండా ప్రతి ఇంజనీర్ నెలకు రూ.5 వేల చొప్పున ప్రయాణ భత్యం పేరిట డ్రా చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇలా అద్దె రూపంలో ఏడాదికి రూ.3.30కోట్లు, ప్రయూణ భత్యం రూపంలో రూ.12కోట్లు స్వాహా అవుతున్నారుు. అలాగే, కొందరు కార్లను ట్రావెల్స్ మాదిరిగా నడిపిస్తూ పనులు జరిగే ప్రాంతాలకు కాంట్రాక్టర్ల వాహనాల్లో వెళ్లి వస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top