తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు షాక్!


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు లక్ష మంది ఇంటర్ విద్యార్థులకు షాక్ తగిలింది. సదరు విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ,ట్రిపుల్ఈ పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోనున్నారు. అసలు సంగతి ఏమిటంటే.... రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పటు చేసింది. ఈ విషయంపై సీబీఎస్ఈకి తెలంగాణ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు.


అయితే కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అని మాత్రమే సమాచారం ఉంది. దాంతో తెలంగాణలోని ఇంటర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఈ పరీక్షల నిర్వహణకు సీబీఎస్ఈ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆ విషయాన్ని చివరి నిమిషంలో గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై కదలింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top