విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు

విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు - Sakshi


విద్యుత్ అమరవీరులకు వామపక్షాలు, కాంగ్రెస్ నేతల నివాళి

 

హైదరాబాద్: ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలపై విద్యుత్ ఉద్యమం స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని కాం గ్రెస్, వామపక్షాల నాయకులు పిలుపునిచ్చా రు. విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన ముగ్గురు అమరులకు ఇచ్చే నిజమైన నివాళి ఇదేనని వారు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో 2008 ఆగస్టు 28న జరిగిన విద్యు త్ ఉద్యమం సందర్భంగా పోలీస్‌కాల్పుల్లో విష్ణువర్థన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ మృతి చెందారు. ఈ ఘటన జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని షహీద్ చౌక్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ఈ పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ కె.నారాయణ, అజీజ్‌పాషా, ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, పీజే చంద్రశేఖరరావు, టి,లక్ష్మీనారాయణ,బాలమల్లేష్ (సీపీఐ), బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, డీజీ నర్సింగరావు(సీపీఎం), కె.గోవర్ధన్, వి.సంధ్య(న్యూడెమోక్రసీ-చంద్రన్న), వేములపల్లి వెంకట్రామయ్య(న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), జానకిరాములు(ఆర్‌ఎస్‌పీ), బండ సురేందర్‌రెడ్డి(ఫార్వర్డ్ బ్లాక్), మురహరి(ఎస్‌యూసీఐ-సీ), కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, నాయకులు కాసు కృష్ణారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు.



ఆ విధానాలను ఎండగడతాం: కాంగ్రెస్

టీడీపీ, టీఆర్‌ఎస్‌ల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి విద్యుత్ ఉద్యమ అమరుల త్యాగాల స్ఫూర్తితో పోరాటం చేస్తామని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి  కాంగ్రెస్ పార్టీ పునరంకితం అవుతుందన్నారు. టీడీపీ పాలన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకునేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం చరిత్రాత్మకమైనదని రఘువీరారెడ్డి అన్నారు.  ప్రజా సమస్యలకు సరైన పరిష్కారం కోసం అన్నిపార్టీలు మరోసారి సంఘటితంగా ఉద్యమించాలని టీసీఎల్పీనేత జానారెడ్డి అన్నారు.  



అవి ప్రపంచబ్యాంకు బానిసలు: నారాయణ  

టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పాలకులం తా ప్రపంచబ్యాంకుకు దాసోహమనే బానిసలేనని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. విద్యుత్ ఉద్యమంలోకి రావాలని అప్పట్లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌ను సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కలసి కోరినా ఉద్యమంలో చేరలేదన్నారు. ప్రపంచబ్యాంకు ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోకరిల్లి రూ.25 వేలకోట్ల రుణానికి దరఖాస్తు చేసుకుందని, ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రజలపై చార్జీల భారం మరింత పెరుగుతుందని  సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హెచ్చరించారు. అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం కొనసాగిస్తున్న నిరంకుశ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని  సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top