వామ్మో.. ఫీవర్

వామ్మో.. ఫీవర్


 


 


 


 


కేసుల నమోదు ఇలా..

 

 నెల                        పరీక్షించిన రోగులు        డెంగీ     మలేరియా     చికున్‌గున్యా     ఫైలేరియా

 సెప్టెంబర్ వరకు            3,86,766               8            56                    27              34

 అక్టోబర్‌లో                       37,214               2              3                    20                3


 

 సాక్షి, మహబూబ్‌నగర్:

 జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో ఒకరిద్దరి చొప్పున మంచం పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్‌గున్యా, ఫైలేరియా వ్యాధులతో జనం సతమతమవుతున్నారు. వ్యాధులను నయంచేసేందుకు ఆస్పత్రుల్లో తగిన వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25,902 మందికి విషజ్వరాలు ప్రబలినట్లు ప్రభుత్వ వైద్యగణాంకాలు సూచిస్తున్నాయి.



ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సపొందిన వారిసంఖ్య మరింత రెట్టింపు ఉంటుందని అంచనా. అయితే జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన 3,86,766 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. వీరిలో 56 మందికి మలేరియా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే డెంగీకేసులు 8, చికెన్‌గున్యా వ్యాధిన పడిన వారు 27 మంది ఉన్నారు.



ఫైలేరియా సోకిన వారు 34 మంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అక్టోబర్ ఒక్క నెలలోనే 37,214 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా ముగ్గురికి మలేరియా, ఇద్దరికి డెంగీ, ముగ్గురు ఫైలేరియా బారినపడినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదభరితమైన డెంగీ, చికెన్‌గున్యా వ్యాధులు వాస్తవానికి ఇంతకంటే ఎక్కువగా ఉంటాయని వైద్యసిబ్బంది పేర్కొంటున్నారు.



  వైద్యసిబ్బంది అంతంతే..

 సుస్తీ చేసి దవాఖానాకు వెళ్తే పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొదలుకుని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో కూడా వైద్యసిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో 85 పీహెచ్‌సీలు, ఐదు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ప్రధాన ఆస్పత్రి ఉంది. పీహెచ్‌సీలను మి నహాయించి అన్ని ఆస్పత్రుల్లో 840 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నా యి. అయితే వీటికి మంజూరైన వైద్యపోస్టుల్లో సగం వరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.



జిల్లా మొత్తంలో సివిల్‌సర్జన్ స్పెషలిస్టు 22 మందికి గాను 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే గైనకాలజిస్టు 30మంది ఉండాల్సి ఉండగా 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనస్థిషియా నిపుణులకు సం బంధించి 10పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్ సర్జరీ 14 పోస్టులకు గాను 8 ఖాళీ, జనరల్ మెడిసిన్ విభాగంలో 14 పోస్టులకు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా అన్ని విభాగాల్లో 213 పోస్టులకు 89 భర్తీకి నోచుకోవడం లేదు. వైద్యసిబ్బంది కొరత కారణంగానే రోగులకు చికిత్స అందడం లేదు. పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వైద్యసిబ్బంది లేని కారణంగా రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top