సిర్గాపూర్. ఇన్!

సిర్గాపూర్. ఇన్! - Sakshi


అది మారుమూల గ్రామం.. పైగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం.. అయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దూసుకెళుతోంది.. ప్రపంచంలో ఎవరైనా తెలుసుకునే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు, జనాభా, తండాలు, ప్రభుత్వ సంస్థలు, రేషన్, పింఛన్, తదితర ప్రభుత్వ పథకాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఇలా.. అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది కల్హేర్ మండలంలోని సిర్గాపూర్.    

 

- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందంజ

- పారదర్శకత కోసం వైబ్‌సైట్ రూపకల్పన

- ప్రపంచానికి అందుబాటులో గ్రామ సమాచారం

- వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టిన సర్పంచ్ మనీష్‌పాటిల్

కల్హేర్:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సిర్గాపూర్ గ్రామం ముందంజలో ఉంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను రూపొందించారు.  కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ఇండియాకు స్ఫూర్తిగా గ్రామ సర్పంచ్ మనీష్‌పాటిల్ కృషీతో ‘సిరాపూర్.ఇన్’ పేరిట కొత్తగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. సర్పంచ్ మనీష్‌ఫాటిల్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పారదర్శకత కోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు.



వెబ్‌సైట్‌ను కంప్యూటర్‌లో క్లీక్ చేస్తే గ్రామనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం కలిపించారు. మనీష్‌పాటిల్ ఇప్పటికే గ్రామనికి సంబంధించిన ఫేస్‌బుక్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. సిర్గాపూర్ గ్రామం పేరిట తయారు చేసిన వెబ్‌సైట్‌లో వివిధ ఫిర్యాదులను గ్రామ ప్రజల నుంచి స్వీకరించేందుకు అవకాశం కల్పించారు. వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే సర్పంచ్‌కు, గ్రామం పేరిట ఏర్పాటు చేసిన ఈ మెయిల్ ఐడీకి మెసేజ్ చేరుతుంది. వీటి ఆధారంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడాతారు.

 

వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే..

సిర్గాపూర్ డాట్ ఇన్ పేరిట అందుబాటులోకి తెచ్చిన వెబ్‌సైట్‌ను సోమవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ప్రాంభించారు. అంతకు ముందు సర్పంచ్ మనీష్‌పాటిల్ వెబ్‌సైట్ గురించి ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. సర్పంచ్‌ను ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి, తదితరులు అభినందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మంచిపేరు వస్తుందని కోనియడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇతర సర్పంచ్‌లు సిర్గాపూర్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ భాస్కర్‌సేట్, ఎస్‌ఐ శంకరయ్య, హెచ్‌ఎం గురునాథ్, ఎంపీటీసీ రాజుకుమార్, కాంగ్రెస్ నాయకులు అంజిరెడ్డి, మహేశ్వర్‌సేట్, శివకుమార్, సంగమేశ్వర్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top