పనిచేయని డాక్టర్లకు ఇంక్రిమెంట్లు ఆపండి


  సంగారెడ్డి అర్బన్ :

 పనిచేయని డాక్టర్లకు ఇంటి అద్దెతో పాటు ఇంక్రిమెంట్లను ఆపాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని డాక్టర్లతో స్వైన్‌ఫ్లూతో పాటు పీహెచ్‌సీలలో నిర్వహిస్తున్న ప్రసవాలపై సమీ క్ష నిర్వహించారు. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతున్నందున ప్రజల ను అప్రమత్తం చేయాలని కోరారు. అందులో భాగంగానే వ్యాధి కారకాలు, నివారణాలపై గోడపత్రికలు, కరపత్రా లు ఇతర పబ్లిసిటీ మెటీరియల్‌ను ప్రతి గ్రామ పంచాయతీ, మండల కార్యాలయాలు, కూడళ్ల వద్ద అతికించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు చొరవ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.


 


ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ తమ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, తు మ్ములు, గొంతునొప్పి, ఒళ్లునొప్పు లు, శ్వాసలో ఇబ్బందులు ఉన్నట్లు అయి తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటూ రోగులకు సేవలంచాలని సూచించారు. కొన్ని నెలలుగా కొన్ని కేంద్రాల్లో ఒక్క ప్రసవం కూడా జరుగక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అర్హత గల డాక్టరు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉండి కూడా గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారంటే అందుకు కారణం డాక్టర్ నిర్లక్ష్యమేన్నారు. ఎస్‌పీహెచ్‌ఓలు ఇకపై ఎప్పటికప్పుడు పారామెడికల్ సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని ఏఎన్‌ఎమ్‌లకు ప్రతినెలా లక్ష్యాలను నిర్దేశించాలని,  ల క్ష్యాలు సాధించని ఏఎన్‌ఎంల జీతాలను ఆపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


డాక్టర్లు రిస్క్ ఉన్న కేసులను చేపట్టి, మిగితా వాటిని వదిలేయడం తగదన్నారు. హైరిస్క్ కేసులను ఎప్పటికప్పడు సమీక్షిస్తూ అవసరమైన ఏరియా ఆస్పత్రులకు, హెడ్ క్వార్టర్ ఆస్పత్రులకు పంపాలి కానీ ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించవద్దని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ బాలాజీ పవార్, పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top