బీఈడీకి జోష్

బీఈడీకి జోష్


శాతవాహన యూనివర్సిటీ : కొంతకాలంగా విద్యార్థులు పెద్దగా శ్రద్ధ చూపని బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుకు ఈ ఏడాది డిమాండ్ పెరిగింది. ఈ కోర్సును రెండేళ్లకు పెంచాలని ఇటీవల కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుందన్న ప్రచారం నేపథ్యంలో సీట్లకు గిరాకీ పెరిగింది. గతేడాది రూ.30 వేలు ఉన్న సైన్స్ సీటు ఇప్పుడు రూ.70 వేలు పలుకుతోంది. ఆర్ట్స్ విభాగంలో బీఈడీ సీటు రూ. లక్షల్లో పలుకుతోంది. కౌన్సెలింగ్ నిర్వహించకముందే మేనేజ్‌మెంట్ సీట్లపై బేరసారాలు మొదలయ్యాయి. కళాశాలల యాజమాన్యాలు ఇదే అదనుగా భావిస్తూ రేట్లు పెంచుతున్నాయి.

 

 జిల్లాలో బీఈడీ సీట్లకు పెరిగిన డిమాండ్‌పై కథనం..

 

రెండేళ్ల కోర్సుతో..

సెకండరీ గ్రేడ్ టీచర్‌ల నియామకానికి కేవలం డీఈడీ చేసిన అభ్యర్థులే అర్హులనే ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో బీఈడీ కోర్సు ఆదరణ తగ్గింది. బీఈడీ కోర్సు నిర్వహణలో ఆర్థిక భారాన్ని డీఈడీ కోర్సుతో సర్దుకునేందుకు ఒకే ప్రాంగణంలో కళాశాలల యాజమన్యాలు ఈ రెండు కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇటీవల కాలంలో  బీఈడీ కోర్సు రెండేళ్ల ప్రతిపాదన రావడంతో ఇప్పుడు బీఈడీ సీట్లకు రెక్కలొచ్చాయి.

 

రెండింతలు

బీఈడీ కళాశాలల్లోని మేనేజ్‌మెంట్ సీట్ల ధరలు గతం తో పోలిస్తే రెండింతలయ్యాయి. గతంలో మ్యాథ్స్, సై న్స్ సీట్లు దాదాపు రూ.30వేల నుంచి రూ.45 వేల వర కు పలికాయి. ప్రస్తుతం అవే సీట్లు రూ.70 వేలకు చేరా యి. ఆర్ట్స్ సీట్ల ధరలు వింటే మైండ్ బ్లాక్ కావాల్సిందే. కౌన్సెలింగ్ విషయంలో నేటికి స్పష్టత లేకున్నా అభ్యర్థులు మాత్రం ముందుగానే సీట్లను దక్కించుకునే పనిలో పడ్డారు. కరీంనగర్‌లోని అనేక కళాశాలల్లో మహిళలు సీట్లు తీసుకునేందుకు శ్రద్ధ వహించడంతో యాజమాన్యాలు రేట్లు పెంచుతున్నాయి.

 

కౌన్సెలింగ్‌పై సందిగ్ధత

బీఈడీ కౌన్సెలింగ్‌పై ఇప్పటికీ అధికారిక ఉత్తర్వులు రాలేదు. గత నెల ప్రవేశాలు జరుగుతాయని భావించి నా, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కౌన్సెలింగ్ విషయంలో అధికారిక ప్రకటన రాకముందు ఎప్పుడు నిర్వహించేది తేల్చలేమని కేయూ అధికారులు పేర్కొంటున్నారు. 2013-14 విద్యాసంవత్సరం బీఈ డీ పరీక్షలు సెప్టెంబ ర్‌లో ఉన్నందున అక్టోబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నా య ని బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు అభిప్రాయపడుతున్నారు.

 

జిల్లాలో బీఈడీ కళాశాలల సీట్ల వివరాలు..

జిల్లాలో 19 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1,940 సీట్లు ఉన్నాయి. ప్రతీ కళాశాలలో 20 శాతం సీట్లను కళాశాల మేనేజ్‌మెంట్ కోటా కింద అమ్ముకునేందుకు అవకాశం ఉంది. రెండేళ్ల ప్రచారం నేపథ్యం లో  కరీంనగర్‌తోపాటు శివారులోని బీఈడీ కళాశాలల్లో అధికంగా సీట్లు అమ్ముడుపోయే అవకాశాలున్నాయి.  

 

రంగంలోకి ఇతర రాష్ట్రాల పీఆర్వోలు

స్వరాష్ట్రంలో సీటు రేటు అధికంగా ఉంటుందనే విషయాన్ని చెబుతూ ఇతర రాష్ట్రాల బీఈడీ కళాశాలల పీఆ ర్వోలు జిల్లా వాసులను బుట్టలో వేసే పనుల్లో పడ్డారు. మా కళాశాలలో చేరితే రికార్డ్స్ రాయనవసరం లేదని,  కళాశాలకు హాజరుకావాల్సి అవసరమే లేదని మభ్యపె డుతున్నారు. పరీక్షల సమయంలో ఆయా ప్రాంతాలలో హాస్టల్ వసతితో కలుపుకుని రూ.50 వేలతో కోర్సు పూర్తి చేయవచ్చని ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంగా లక్షల రూపాయల వ్యాపారం సాగుతోంది. ప్రవేశాల క్రమంలో పీఆర్వోలు చెబుతున్నది ఒకలా ఉంటే.. పరీక్షల సమయంలో మరొకలా ఉండి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డ ఘటనలు సైతం ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top