నగరంలో మాస్టర్‌ప్లాన్

నగరంలో మాస్టర్‌ప్లాన్


నగర పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి

 తొలివిడతలో దేవరకొండకు స్థానం

రానున్న 30ఏళ్లలో పెరిగే  జనాభాకనుగుణంగా ప్రణాళిక

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో బేస్ మ్యాప్‌ల సేకరణ


 

దేవరకొండ : నగర పంచాయతీల్లో రానున్న 30 ఏళ్లలో  పెరగనున్న జనాభా... ప్రజా అవసరాలు... ప్రభుత్వం  చేపట్టనున్న అభివృద్ధి పనులు... మౌలిక  అవసరాలు.. భవిష్యత్ ప్రణాళికవంటి వాటిపై ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌కు సిద్ధమైంది. రాష్ట్రంలో 68 నగర పంచాయతీలు ఉండగా ముందస్తుగా 27 నగర పంచాయతీలను ఎంపిక చేసింది. అందులో జిల్లాలోని దేవరకొండ నగర పంచాయతీకి స్థానం దక్కింది. పురపాలక శాఖ ద్వారా మరికొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించి ముందస్తుగా బేస్ మ్యాప్‌లను తయారు చేసేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో ఉపగ్రహ చాయాచిత్రాలను సేకరించే అవకాశం ఉంది. తద్వారా నగరాలు, పట్టణాల అభివృద్ధికి బీజం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.



దేవరకొండ నగర పంచాయతీ విస్తీర్ణం 28.1 స్క్వీయర్ మీటర్లు. మొత్తంగా 20వార్డులు ఉండగా జనాభా 35వేలు ఉంటుంది. ఇక రోజూవచ్చిపోయే వారి సంఖ్య అదనంగా 10వేలు ఉంటుందని అం చనా. పట్టణం నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీ య రహదారికి అతి సమీపంలో ఉంటుంది. హైవేపై ఉన్న కొండమల్లేపల్లి, దేవరకొండ పట్టణం కలిసే ఉంటాయి. ఇక..చందంపేట మండల వాసులు చాలా మంది పట్టణంలోనే నివాసం ఉంటారు. ఇక.. డిండి, చింతపల్లి మండలవాసులు వ్యాపారరీత్యా దేవరకొండకు వచ్చిపోతుంటారు.



ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నాయి..

 గత పరిస్థితులను అధిగమించేందుకే..


 పాలకులు, అధికారులు మారుతున్నారు. అభివృద్ధి కోసం ఎవరి ప్లాన్ వారిది... ఒకరు ఒక ప్రాజెక్టు అవసరమని గుర్తిస్తే ఆ పనులు పూర్తయ్యేలోపు ప్రభుత్వాలు మారడం, ఆ పనికి ఫుల్‌స్టాప్ కూడా పడుతుంది. ఇలా ఎన్నో పనులు మరుగునపడ్డ దాఖలాలున్నాయి. అంతేకాక ప్రస్తుతం ఉన్న జనాభా అవసరాలకు పనులను గుర్తిస్తే పెరిగే జనాభా వల్ల చేసిన అభివృద్ధి నిర్వీర్యం అవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పెరిగే జనాభా, భూ వినియోగం, ప్రజా ప్రయోజనాలు గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయనుంది.



అమలైతే..

ప్రభుత్వం ఆశిస్తున్నట్లు నగర ప్లాన్ అమలైతే రాను న్న ముందు తరాలకు పూర్తి స్థాయిలో అన్ని రకాలైన వసతులు ముందస్తుగానే ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న జనాభా మరో 20 ఏళ్ళలో పెరిగే జనాభాకు అనుగుణంగా కళాశాలలు, విద్యా, వైద్య సౌకర్యాలు జనాభాకు అనుగుణంగా నివాస స్థలలు,, రోడ్లు వంటి వసతులు వనగూరే అవకాశం ఉంది. ప్లాన్ ద్వారా ప్రజల అవసరాలను ముందస్తుగానే గుర్తించడం ద్వారా ముందు తరాలకు అన్ని సౌకర్యాలు ముందుగానే సమకూరుతాయి.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top