నగరంలో హైటెక్ వ్యభిచారం


- అడ్డాలుగా ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లు

- మసాజ్‌ల పేరిట యువతకు ఎర

- పోలీసుల కనుసన్నల్లోనే కేంద్రాలు

వరంగల్ క్రైం :
నగరంలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. కొంతకాలంగా పోలీసులు వ్యభిచార కేంద్రాలపై దృష్టి సారించకపోవడంతో ఈ చీకటి వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండాపోయింది. 2013 తర్వాత నగరంలో జరుగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు పెద్ద గా పట్టించుకోవడం మానేశారు. దీంతో వరంగల్ నగరం వ్యభిచార నిర్వహణకు సేఫ్టీ పాయిం ట్‌గా మారింది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ విచ్ఛలవిడిగా వ్యభి చార గృహాలు రహస్యంగా నడుస్తున్నాయి. అక్కడా ఇక్కడ అని కాకుండా ప్రతీచోట వ్యభిచార గృహాలు వెలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో.



రెండేళ్లుగా పోలీసుల నిఘా తగ్గడంతో మళ్లీ పాతవారితోపాటు కొత్తగా మరింత మంది ఈ వృత్తిలోకి ప్రవేశించారని తెలుస్తోంది. హైదరాబాద్ మాదిరిగా వరంగల్‌లో కూడా ఈ వ్యభి చార వ్యాపారం విచ్ఛలవిడిగా మారడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది కాలంలో పోలీస్‌స్టేషన్లలో వ్యభిచారానికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వంగపహాడ్‌లాంటి గ్రామాల్లో గతంలో జోరుగా నడిచిన వ్యభిచారం కొంతకాలంగా తగ్గుముఖం పట్టినా పోలీ సులు ఇంకా అక్కడే పాగా వేస్తున్నారు. నగరంలో గుట్టుగా సాగుతున్న వ్యవహారంపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నారు.



పోలీసుల కనుసన్నల్లోనే ?

రెండేళ్ల క్రితం వరకు పక్కా సమాచారంతో అపార్ట్‌మెంట్‌లు, బ్యూటీపార్లర్లు, విలాసవంతమైన భవనాలు, హోటళ్లపై పోలీ సులు దాడి చేసి పదుల సంఖ్యలో వ్యభి చారులను పట్టుకున్నా రు. విటులను అరెస్టు చేసి, జైలు కు పంపారు. ఆ తర్వాతే అస లు కథ మొదలైంది. ఒకసారి పట్టుబడిన వ్యభిచార కేంద్ర నిర్వాహకులు సదరు పోలీసులతో సాన్నిహిత్యం పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తాము వేశ్యాగృహం నిర్వహించే పరిధిలోని పోలీ సులకు ప్రతీనెలా మామూళ్ల రూపంలో డ బ్బులు చెల్లిస్తూ వ్యభి చార కేంద్రాలను నడుపుతున్నట్లు సమాచారం. గతంలో పట్టుబడినవారంతా ఇళ్లు మారినప్పటి కీ తమ దందాను యథావిధి గా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. గతంలో వ్యభిచార గృహాల ను నడిపిన నిర్వాహకులపై నిఘా పెడితే ప్రస్తుతం నడుస్తున్న, కొత్త గా వెలసిన వ్యభిచార గృహాల గుట్టురట్టయ్యే అవకాశముంది.



హైటెక్ పద్ధతి వ్యభిచార కేంద్రాల నిర్వహణ

వ్యభిచార కేంద్రాలు హైటెక్ పద్ధతిలో కొనసాగుతున్నట్లు తెలి సింది. ఎవరికీ అనుమానం రాకుండా స్టార్ హోటళ్లు లేదా ఏసీ గదుల్లో హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. నమ్మకమైన వ్యక్తుల ద్వారానే ఈ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. నిర్వాహకులకు వందల సంఖ్యలో రెగ్యులర్ కస్టమర్లు(విటులు) ఉన్నట్లు తెలి సింది. ఫోన్ల ద్వారా విటులను హోటళ్లకు పిలిపించి అక్కడికే ఈ వృత్తిలో ఉన్న యువతులను తీసుకొస్తున్నారని తెలిసింది. విటుడి కోరిక మేరకు వయస్సు, రంగు, పర్సనాలిటీ ఉండేలా ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చాక సెలక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం. తర్వాత విటుడు మధ్యవర్తుల వాహనాల్లో వ్యభిచార గృహానికి చేరుకుంటున్నారు. వ్యభిచార గృహా లను విలాసవంతంగా ఏసీ గదులు, ఎల్‌ఈడీ టీవీలతో సర్వహంగులతో తీర్చిదిద్దుతున్నారు. విటుడికి కావాల్సిన బ్రాండ్ మద్యం కూడా వారే సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.



కొత్తగా పుట్టుకొచ్చిన ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లు

ఇటీవల హైటెక్ వ్యభిచారానికి ప్రైవేటే గెస్ట్‌హౌస్‌లు అడ్డాగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. లాడ్జీలపై పోలీ సుల నిఘా పెరగడం, జనసంచారం ఎక్కువగా ఉంటుండడంతో వాటి స్థానంలో విటులు, వ్యభిచార నిర్వాహకులు ఇటీవల ప్రైవేటు గెస్ట్‌హౌస్‌ల ను ఆశ్రరుస్తున్నట్లు తెలిసింది. చాలా విశాలంగా ఉండే ఒక్కో గెస్ట్‌హౌస్‌లో మూడు నుంచి నాలుగు గదులు ఉంటాయి.



రోజుకు గెస్ట్ వినియోగానికి రూ.1500 నుంచి రూ.3 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. చాలా రిచ్‌గా కని పించే ఈ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌ల్లో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పా టు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ గెస్ట్‌హౌస్‌ల్లో వ్యభిచారంతోపాటు పేకాట జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.



మసాజ్‌ల పేరిట యువతకు ఎర

వ్యభిచారం కోసం అంటూ డెరైక్ట్‌గా విటులను పిలవకుండా మసాజ్‌ల పేరుతో యువతకు ఎర వేస్తున్నారు. మసాజ్ పేరుతో అందులోకి అడుగుపెడితే హైటెక్ వ్యభిచారానికి తోవదొరికినట్లే. ఇలా మసాజ్‌ల పేరుతో యువతకు గాలం వేస్తున్నారు. వీట న్నింటిపై దృష్టి పెట్టాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఇకనైనా వీటికి అరికట్టేందుకు కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top