ఆర్టీసీలో ‘ఉమ్మడి ఆస్తులు’

ఆర్టీసీలో ‘ఉమ్మడి ఆస్తులు’


మూడో ఖాతాను తెరిచిన రోడ్డు రవాణా సంస్థ

బస్‌భవన్, ఆర్టీసీ ఆసుపత్రి, బాడీ బిల్డింగ్ వర్క్‌షాపుల బదలాయింపు

షీలాభిడే కమిటీ ‘ప్రైవేటుఏజెన్సీ’ నివేదిక ప్రకారం చర్యలు

ఆమోదం కోసం త్వరలో పాలకమండలి భేటీ

ఆస్తులను పంచితే టీ ఆర్టీసీకి నష్టం వస్తుందంటున్న అధికారులు


 

హైదరాబాద్: ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత ఆస్తులు, ఆంధ్రాప్రాంత ఆస్తులతో ప్రత్యేక ఖాతాలున్న ఆర్టీసీలో తాజాగా ఉమ్మడి ఆస్తుల ఖాతా తె రుచుకుంది. హైదరాబాద్‌లోని మూడు ప్రధాన స్థిరాస్తులను ఇందులో చేరుస్తూ తాజాగా ఆర్టీసీ ఆర్థిక విభాగం కొత్త ఖాతాను ప్రారంభించింది. అయితే, గుట్టుచప్పుడు కాకుం డా జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగుచూడడంతో ఆర్టీసీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆర్టీసీకి సం బంధించి ‘ఉమ్మడి ఆస్తి’ అనే వాక్యమే లేనప్పటికీ తెరవెనక కుట్ర చేసి ఈ కొత్త ఖాతా తెరిచి తెలంగాణ అస్తులను అందులోకి బదలాయించారని తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పూర్తయిన ఖాతాలు, చిట్టాపద్దులకు బోర్డు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో.... ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకున్న ‘ఉమ్మడి ఆస్తుల ఖాతా’కు మళ్లీ ఆమోదం లభించాల్సి ఉంది. దీంతో హడావుడిగా పాలకమండలిని సమావేశపరిచి ఈ ఖాతాకు ఓకే చెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.



ఇదీ సంగతి...



రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ కూడా రెండుగా విడిపోవాల్సి ఉంది. కానీ ఆస్తుల విభజనపై పీటముడి ఏర్పడడంతో కేంద్రం షీలాఖిడే కమిటీని నియమించింది. గతంలో ఆర్టీసీ అప్పులు-ఆస్తులకు సంబంధించి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో కూడిన కమిటీ గవర్నర్‌కు సమర్పించిన నివేదికలో ఎక్కడా ఉమ్మడి ఆస్తుల అంశాన్ని ప్రస్తావించలేదు. హైదరాబాద్‌లోని కొన్ని స్థిరాస్తులపై వివాదం నెలకొందనే అంశాన్ని మాత్ర మే అందులో పొందుపరిచారు. దీంతో ఇప్పటి వరకు ఆస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఖాతాలు (బుక్ ఆఫ్ రికార్డ్స్)ను కొనసాగిస్తున్నారు. తాజాగా షీలాభిడే కమిటీ ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్న ఓ ప్రైవేటు సం స్థ ఆర్టీసీ ఆస్తులపై తిరిగి మూల్యాంకనం చేసి, నాలుగైదు రోజుల కిత్రం నివేదికను అందజేసిం ది. దాన్ని ఆసరా చేసుకుని ఆర్టీసీ ఫైనాన్స్ విభా గం ‘ఉమ్మడి ఆస్తుల ఖాతా’ను తెరిచింది. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం అయిన బస్‌భవన్, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, మియాపూర్‌లోని బస్ బాడీ బిల్డింగ్ వర్క్‌షాపును అందులోకి బదలాయించేసింది. ఆర్టీసీ బోర్డు అనుమతి తంతు పూర్తిచేసుకుంటే నివేదిక షీలాభిడే కమిటీకి,  అక్కడి నుంచి కేంద్రప్రభుత్వానికి చేరుతుంది. ఇదిలాఉండగా, ఈ మూడు ఆస్తుల మూల్యాం కనం మార్కెట్ ధర ఆధారంగా జరిగిందని సమాచారం. దాని ప్రకారం 58:42 నిష్పత్తిలో ఆస్తులను పంచితే టీఆర్టీసీ నష్టపోతుందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

టీఎస్సార్టీసీ నష్టాలు రూ.450 కోట్లు



ఆర్టీసీ నష్టాల్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీదే. లెక్కల ప్రకారం ఇప్పటివరకు  తెలంగాణ ఆర్టీసీ నష్టాలు రూ.900 కోట్లు ఉంటే, ఏపీ నష్టాలు రూ.2,350 కోట్లకు పైగా ఉన్నాయి. తాజాగా ఏర్పడ్డ ప్రైవేటు సంస్థ ఈ నష్టాలను కూడా భారీగా ‘సవరించిన’ట్టు  తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. ఏపీవాటా నష్టాలను రూ.450 కోట్ల మేర తగ్గించి... తెలంగాణ ఆర్టీసీ నష్టాలను అంతే మొత్తంలో పెంచి చూప డం వీలైనంత ఎక్కువ కాలం ఆర్టీసీ కలిసే ఉండేలా చేసే ప్రయత్నమేనని టీ.అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top