కోదాడ కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు


కోదాడ: పట్టణంలోని ఈవీరెడ్డి డిగ్రీకళాశాలలో విజిలెన్స్‌ ప్రత్యేక బృందం తనిఖీ చేసింది.  వసతులు, ప్రయోగశాలలు, తరగతి గదులు, విద్యార్థుల హాజరు పట్టికలు, అధ్యాపకుల వివరాలను కళాశాల నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కోదాడలోని సుగుణ డిగ్రీ కళాశాలను తనిఖీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విజిలెన్స్‌ అధికారులతో పాటు కళాశాల కరస్పాండెంట్‌ గింజల రమణారెడ్డి, జీఎల్‌ఎన్‌రెడ్డి, కెపీబీవీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.



ప్రైవేట్‌ పాఠశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

పట్టణంలోని పలు ప్రైవేట్‌ పాఠశాలల్లో గురువారం విద్యాశాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాల భవనాలను పరిశీలించి ఫీజుల వివరాలను తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో లోపాలను గుర్తించినట్లు సమాచారం. ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే ప్రభుత్వ గుర్తింపు రద్దవుతుందని యాజమాన్యాలను హెచ్చరించారు. తనిఖీలపై తమ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని వారు  తెలిపారు. ఈ తనిఖీలలో నడిగూడెం ఎంఈఓ సలీంషరీఫ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా పట్టణంలోని పలు ప్రైవేట్‌ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో గురువారం  విజిలెన్స్‌ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top