104లో అక్రమ డిప్యూటేషన్లు రద్దు

104లో అక్రమ డిప్యూటేషన్లు రద్దు - Sakshi


- కలెక్టర్ ఆదేశాలతో తిరిగి కౌన్సెలింగ్

- 29 మందికి పోస్టింగులు..

- డీఎంహెచ్‌వోలో అక్రమాలపై ఏజేసీ విచారణ ఎప్పుడో..?

ఖమ్మం వైరారోడ్ :
104లో క్రమ డిప్యూటేషన్లును జిల్లా కలెక్టర్ రద్దుచేశారు. తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించటంతో 104 నోడల్ అధికారిణి కోటిరత్నం ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చారు. 104లో గతంలో కొందరు అధికారులు అక్రమంగా డిప్యూటేషన్లు నిర్వహించి  29 మంది ఉద్యోగులకు  కోరుకున్న చోట పో స్టింగ్‌లు ఇచ్చి, వారి వద్ద నుండి భారీగా ము డుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నారు.



అయితే వీరికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు లేకుండానే ఈ తతంగం అంతా నిర్వహించటంతో విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో  ఆయన విచారణకు ఆదేశించి, దిద్దుబాటు చ ర్యలు చేపట్టారు. తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలని నోడల్ అధికారిణిని ఆదేశిం చారు. ఆదివారం ఫార్మాసిస్ట్‌లు,ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డైవర్లు, స్టాఫ్‌నర్స్, తదితర ఉద్యోగులకు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి 29 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు.

 

ఏజేసీ విచారణ ఎప్పుడో ?

డీఎంహెచ్‌లో గతంలో చోటు చేసుకున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ గత నెల విచారణకు ఆదేశించారు. ఏజేసీ బాబూరావును విచారణ అధికారిగా నియమించారు.  మే 16న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భానుప్రకాశ్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వెంకటేశ్వర్లును విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. భానుప్రకాశ్‌పై వైద్య ఆరోగ్య శాఖలో అక్రమ  డిప్యూటేషన్ల వ్యవహరంలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ యేడాది పల్స్ పోలియో నిర్వహణ కోసం రూ. 47 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను కూడా దుర్వినియోగం చేశారనే ఆరోపణ రావటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వీరితో పాటు సర్వీస్ ఇంజనీర్ తిరపయ్య, డీఎంహెచ్ కార్యాలయంలో గతంలో సూపరిండెంట్‌గా పనిచే సిన  ఇస్మాయిల్‌కు కూడా నోటీసులు పంపించారు. కానీ పని ఒత్తిడి మూలంగా ఏజేసీ విచారణ చేపట్టడం ఆలస్యమైందని విచారణను వాయిదా వేశారు. అరుుతే ఇంత వరకు డీఎంహెచ్‌ఓలో చోటు చేసుకున్న విచారణపై ఉన్నతాధికారులు నోరుమొపడం లేదు. దీంతో అక్రమాలు వెలుగుచూసే అవకాశం లేకుండా పోయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top