పనితీరు మెరుగుపరుచుకోవాలి


  •     శాంతి భద్రతలను పరిరక్షించాలి

  •      వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు

  • వరంగల్ క్రైం : పోలీసులు తమ పనితీరును ఎప్పటికప్పు డు మెరుగు పరుచుకోవాలని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు అన్నారు. వరంగల్ అర్బన్ అర్థ సంవత్సర నేర సమీక్ష సమావేశం గురువారం నిట్ సెమినార్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి డీఐజీ కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీ సులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పాటుపడాలని కోరారు.



    అలాగే శాంతిభద్రతలను పరిరక్షించేందు కు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. విధుల పట్ల అంకితభావాన్ని ప్రదర్శించే ఉద్యోగులకు తప్పక గుర్తిం పు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని, సామాన్యుడు పోలీస్‌స్టేషన్‌కు ధైర్యంగా వచ్చేందుకు కావాల్సిన వాతావరణం కల్పించాలని సూచించారు. అర్బన్ పరిధిలో భూ కబ్జాలను అరికట్టేం దుకు కలెక్టరేట్‌లో భూమి సెల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.



    నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరి గిపోతుందని, దీనిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బం దీ చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో అర్బన్ పోలీసు విభాగం కమిషనరేట్‌గా ఏర్పడనుందని, దీనికి  తగినట్లు గా పోలీసులు విధులు నిర్వర్తించాలని కోరారు. కాగా, న్యాయశాఖ, ఆర్టీసీ, రోడ్డు రవాణా, వైద్యశాఖ, ఫోరెన్సి క్, జైళ్లు, తదితర ప్రభుత్వ విభాగాల నుంచి ఎదురవుతున్న సమస్యలను పోలీసు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.



    అనంతరం అర్బన్ పరిధిలో ఆరు నెలలు గా జరిగిన సంఘటనలు, నమోదైన కేసులు, పురోగతి పై డీఐజీ, కలెక్టర్, అర్బన్ ఎస్పీలు సమీక్షించారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ ఎం.యాదయ్య, ఓఎస్‌డీ అంబర్ కిషోర్‌ఝా, ట్రాఫిక్ ఓఎస్‌డీ వాసుసేనా, ఫోరెన్సిక్ డెరైక్టర్ నర్సింహరావు, ప్రభుత్వ న్యాయవాది రామానుజారెడ్డి, ఆర్టీసీ వరంగల్ రీజియన్ మేనేజర్ యాదగిరి, జైలు సూపరింటెండెంట్ రమేష్, హన్మకొం డ, కాజీపేట, మామునూర్, క్రైం, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ డీఎస్పీలు దక్షిణమూర్తి, రాజిరెడ్డి, సురేష్‌కుమార్, రాజమహేంద్రనాయక్,ప్రభాకర్, జనార్దన్, రమేష్, సబ్‌ఇన్ స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top