సర్కారు బడుల్లో మెరుగైన విద్య

సర్కారు బడుల్లో మెరుగైన విద్య


►  రూ.130 కోట్లతో మౌలిక వసతులు

మైనార్టీ గురుకులాలు ప్రారంభించిన మంత్రి ఈటల


 

 

కరీంనగర్‌రూరల్/హుజూరాబాద్ : సర్కార్ బడుల్లో కార్పొరేట్ స్థారుులో విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 71 మైనార్టీ గురుకులాలను మంజూరు చేసినట్లు చెప్పారు. హుజూరాబాద్, కరీంనగర్ మండలం బొమ్మకల్‌బైపాస్‌లో మైనార్టీ గురుకుల పాఠశాలలను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉత్తమ స్థారుులో ఉండాలని ఆకాంక్షించారు. హుజూరాబాద్‌లో వచ్చే విద్యాసంవత్సరం వరకు ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలో రూ.25కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఒకే ఏడాదిలో 250 గురుకుల పాఠశాలలను ప్రారంభించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం రాష్ట్రవ్యాప్తంగా 71 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లలో డబ్బు ఆధారంగా విద్యనందిస్తారని. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతోపాటు మానవ విలువలు నేర్పుతారన్నారు.  జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు వరకు రూ.15 కోట్లతో ఫర్నీచర్ అందిస్తామని, రూ.130కోట్లతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తను కూడా గురుకుల పాఠశాలలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు గురుకుల  పాఠశాలల ద్వారా విద్యనందిస్తుందన్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలుంటే ప్రిన్సిపాల్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ ఉపాధ్యక్షుడు, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు ఖర్చు చేస్తుందన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలల్లో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మైనార్టీ శాఖ ఏడీ షఫీమియా, ఉర్దూ అకాడమీ డెరైక్టర్ ఎస్‌ఏ షుకూర్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సర్వర్‌మియా, ఆర్డీవో చంద్రశేఖర్, విట్స్ చైర్మన్ ఆనందరావు, ఎంపీపీ వాసాల రమేశ్, హుజూరాబాద్ నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, డెప్యూటీ ఈవో కట్ల ఆనందం, ఎంఈవో సుమంగళి, జెడ్పీటీసీ మొలుగూరి సరోజన, తహసీల్దార్ జగత్‌సింగ్, ఎంపీడీవో ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top