పెంచుకో... పంచుకో!


  •      నిమజ్జనం పూడిక తరలింపు వ్యయం భారీగా పెంపు

  •      అధికారుల తీరుపై అనుమానాలు

  • సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి ఉత్సవం నగర వాసుల్లో భక్తి ప్రపత్తులను నింపితే... అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. సాగర్‌లో నిమజ్జన పూడిక తరలింపు పేరుతో తాజాగా హెచ్‌ఎండీఏలో నిధుల దుబారాకు తెరలేచింది. సాగర్‌లో నిమజ్జనమయ్యే గణేశ్ విగ్రహాల శకలాలను వెలికితీసి నగరం వెలుపలకు తరలించే పనులను ఏటా హెచ్‌ఎండీఏ చేపడుతోంది.



    ఈ ఏడాది కూ డా ఆ పనులకు రూ.18.56 లక్షల అంచనా వ్యయంతో ఇటీవల అధికారులు టెండరు ఖరారు చేశారు. అయితే పూడిక తరలింపు పేరుతో వెచ్చిస్తున్న నిధులు ఏటా పెరుగుతుండటం విమర్శలకు దారి తీస్తోంది. గత మూ డేళ్లలో ఇందుకు వెచ్చించిన నిధులు... ఈ ఏడాది కేటాయిం చిన మొత్తాన్ని గమనిస్తే అక్రమాలకు ముందే బీజాలు వేశారన్న విషయం అవగతమవుతోంది. 2011, 2012లో ఇందుకోసం రూ.8 లక్షల వంతున వె చ్చించారు.



    2013లో ఈ ఏకంగా రూ.16.21 లక్షలకు టెండర్ పిలిచారు. లెస్‌కు కోట్ చేశారన్న నెపంతో  తమ అనుచరులకు పనులు అప్పగించి, గుట్టుగా వాటాలు వేసుకున్నారన్న విమర్శలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి, రూ.18.56 లక్షల కు అంచనాలు పెంచడం అధికారుల వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. గత ఏడాదికీ, ప్రస్తుత పనులకు బేరీజు వేస్తే తేడా ఏమీ లేదు. వ్యర్థాల పరిమాణం, లారీ ట్రిప్పులు, జేసీబీల వినియోగం గత ఏడాది మాదిరిగానే ఉంది. నిధులు మాత్రం రూ.2.35 లక్షలు పెరిగాయి.

     

    పక్కాగా ఏర్పాట్లు

     

    హుస్సేన్‌సాగర్‌ను వడగట్టి మొత్తం విగ్రహాల శకలాలను వెలికితీసి బయటకు తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. గతంలో డీయూసీలను హెచ్‌ఎండీఏనే నిర్వహిస్తుండటం వల్ల వాటి ఖర్చు ఉండేది కాదంటున్నారు.



    ఇప్పుడు అవి మరమ్మతులకు గురవడంతో వాటిస్థానే 22 జేసీబీలను వినియోగిస్తున్నామని, అందువల్లే ఖర్చు పెరిగిందని వివరణ ఇస్తున్నారు. వాస్తవానికి పూడిక తరలించేందుకు అయ్యే వ్యయంలో గత ఏడాది వరకు జీహెచ్‌ఎంసీ కూడా భాగస్వామ్యం వహించేదని, ఇప్పుడు ఆ మొత్తాన్ని హెచ్‌ఎండీఏ భ రిస్తున్నందున అంచనా వ్యయం పెరిగిందని చెబుతున్నారు.



    నిధులు ఎన్ని ఖర్చు చేశామన్నది కాదు... సాగర్‌లో పూడిక చేరకుండా ఏమేరకు అడ్డుకున్నామన్నదే తమకు ముఖ్యమని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఏడాది 32 శాతం లెస్‌కు కోట్ చేసిన సంస్థకు టెండర్ దక్కిందని, ప్రమాణాల మేరకు పనులు నిర్వహిస్తేనే బిల్లు చెల్లిస్తామని స్పష్టం చేశారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top