‘పంట’ పండిస్తాం!


యాచారం: కూరగాయల పంటల సాగును ప్రోత్సహిస్తే గణనీయమైన దిగుబడులు తీసి చూపిస్తామంటున్నారు యాచారం మండలంలోని రైతులు. మండలంలోని మొండిగౌరెల్లి, యాచారం, చౌదర్‌పల్లి, చింతుల్ల, గడ్డమల్లయ్యగూడ, తమ్మలోనిగూడ, తాడిపర్తి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో వందలాది మంది రైతులు కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. వీరికి దశాబ్దాలుగా ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకుండాపోతోంది. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం, ఒకవేళ ఉన్నా వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లు నిర్ణయించి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.



 దీంతో కొందరు రైతులు యాచారం, మాల్ మార్కెట్లకు దిగుబడులు తీసుకెళుతుం డగా.. మరికొందరు నగరంలోని సరూర్‌నగర్ రైతు బజారు, మాదన్నపేట తది తర మార్కెట్లకు తరలిస్తున్నారు. నాలుగేళ్లుగా ఇబ్రహీంపట్నంలో రైతుబజారు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడమే గానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి  చూపడం లేదు. రైతులకు సకాలంలో కూరగాయల విత్తనాలు సైతం అందడంలేదు.  



 పాత పద్ధతుల్లోనే పంటల సాగు

 ప్రభుత్వ పోత్సాహం లేకపోవడంతో ఇక్కడి రైతులు ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే కూరగాయల పంటల సాగు చేస్తున్నారు.  చౌదర్‌పల్లిలోని పలువురు రైతులు మాత్రమే పందిర్లపై కూరగాయల సాగు, డ్రిప్ సౌకర్యాంతో మంచి దిగుబడి తీస్తున్నారు.



 కానీ మిగతా గ్రామాల్లో రైతుల కాల్వల ద్వారా నీరు పారించి పంటలు సాగు చేస్తున్నారు. సంబంధిత అధికారులను కలిసి ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసేలా సౌకర్యాలు కల్పించాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం జిల్లాను కూరగాయల జోన్‌గా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top