భర్త ప్రోత్సాహంతో...

భర్త ప్రోత్సాహంతో...


ఆమె లక్ష్యానికి భర్త ప్రోత్సాహం తోడైంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. ఉన్నత ఉద్యోగాన్ని సాధించి తన కలను సాకారం చేసుకుంది. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి వైవాహిక జీవితం ఎంత మాత్రం అడ్డుకాదని నిరూపించి అందరిచే షభాష్ అనిపించుకుంది తవిటి శైలజ.

 

 ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెంది న తవిటి శైలజ అందరిలాగే సాధారణ గృహిణి. భర్త మురళి యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కండక్టర్. శైలజ వివాహం జరిగే నాటికే డిగ్రీ పూర్తి చేసింది. వివాహానంతరం అవకాశం రావడంతో 2007లో అంగన్‌వాడీ కార్యకర్తగా ఎంపికైంది. సామాజిక స్పృహ కలి గిన శైలజ ఒక వైపు ఉద్యోగ బాధ్యత లు నిర్వహిస్తూనే ‘కేర్’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి మండల పరిధిలో అనేక సామాజిక సే వా కార్యక్రమాలు నిర్వహించింది. మరోవైపు సికింద్రాబాద్‌లోని పీజీ కాలేజీలో ఎంఎస్‌డబ్ల్యూ కోర్సును పూర్తి చేసింది. ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యం తో ఉన్నత ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంది.

 

 తన నిర్ణయాన్ని భర్తకు తెలిపింది. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు. పిల్లల సంరక్షణ బాధ్యత వారిపై ఉన్నా శైలజ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి ఆమెను ప్రోత్సహించాడు. దీంతో దీంతో ఆమె అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే 2012లో గ్రూప్-2 రాసిన శైలజ మంచి ర్యాంక్ సాధించి ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా ఎంపికైంది. కానీ ఆ ఉద్యోగం ఇష్టం లేక వెళ్లలేదు. అదే సమయంలో మహిళా స్త్రీ సంక్షేమ శాఖ సీడీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ జా రీ చేసింది. వెంటనే దరఖాస్తు చేసిన శైలజ నాలుగు నెల ల పాటు ఇంటి వద్దే ఉంటూ పట్టుదలతో పరీక్షలకు సిద్ధమైంది. పరీక్ష లో మంచి మార్కులు సాధించి సీడీపీఓగా ఎంపికైంది. ఇటీవల వరంగల్ జిల్లా హన్మకొండ రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓగా విధుల్లో చేరింది. కలలు అందరూ కం టారు.. కానీ వాటిని కొందరే సాకారం చేసుకుంటారు. వారిలో శైలజ ఒకరు.

 

 నా కలను సాకారం చేసుకోవడానికి మా ఆయన అందించిన ప్రోత్సాహం మరువలేనిది. ఉన్నత ఉద్యోగం కోసం అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటి నుంచి నాకు వెన్నంటి నిలిచాడు. తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే కుటుంబాన్ని చూసుకున్నారు కాబట్టే నేను లక్ష్యానికి చేరుకున్నా.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top