జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో

జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో


ధరూరు: ఎగువ రాష్ట్రాల్లో కు రుస్తున్న భారీ వర్షాలతో ప్రి యదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపా రు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లోలు క్రమక్రమంగా పెరుగుతున్నాయన్నారు.  రాత్రి 7.30గంటల వరకు ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 13 క్రస్టుగేట్లను ఒక మీటరు ఎత్తుకు, నాలుగు క్రస్టుగేట్లను అరమీటరు ఎత్తుకు  మొత్తం 17 క్రస్టుగేట్ల ద్వారా 97014 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు నీటిమట్టం 1044 అడుగులుగా ఉందని తెలిపారు.



ఇదిలా ఉండగా ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 1612 అడుగులుగా ఉంది.   ప్రాజెక్టుకు 39వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 51000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 1704 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 15000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులువివరించారు.

 

ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి...

 జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలోని మొత్తం ఆరు యూనిట్లకుగాను ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభమైనట్లు జెన్‌కో అధికారులు పేర్కొన్నారు. 1,2,3,5,6 యూనిట్ల ద్వారా మొత్తం 175 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని వారు వెల్లడించారు.

 

సుంకేసులకు కొనసాగుతున్న వరద

 సుంకేసుల బ్యారేజీ వద్ద సోమవారం కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన వున్న తుంగభద్ర డ్యాం నుండి విడుదలవుతున్న నీటితోపాటు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఉదయం 1.20 లక్షల క్యూసెక్కులకు చేరిన వరదనీటితో డ్యాం వద్ద ఏర్పాటుచేసిన 28 గేట్లు మీటరు ఎత్తి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.



సాయంత్రం వరద ప్రవాహం 90 వేల క్యూసెక్కులకు చేరడంతో 24 గేట్లు మీటరు మేర ఎత్తి  88 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నట్లు వర్క్‌ఇన్స్‌పెక్టర్ మునిస్వామి తెలిపాడు. తుంగభద్ర డ్యాంనుండి 31 వేల క్యూసెక్కుల నీరు డ్యాంకు చేరుతుందని, బ్యారేజీలో 1 టిఎంసి నీటిని నిల్వ ఉంచుతూ మిగతా నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. కేసీ కెనాల్‌కు 2500 క్యూసెక్కులు యధావిధిగా విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top