మిర్యాలగూడలో భారీ వర్షం
మిర్యాలగూడ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజీవ్‌చౌక్ సమీపంలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద రోడ్డుపై నీరు నిలువడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని బంగారుగడ్డ, సీతారాంపురం, గాంధీనంగర్ లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.