8 గంటలు.. 100 కి.మీ

8 గంటలు.. 100 కి.మీ


‘కల్వకుర్తి’ కాలువ పనులను పరిశీలించిన హరీశ్‌రావు

పనుల జాప్యం.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం




సాక్షి, నాగర్‌కర్నూల్‌: భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం రోజంతా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువ పనులను పరిశీలించారు. ఏకంగా 8 గంటల పాటు ఆయన కాలువల వెంబడి తిరిగారు. పనులతీరు, నాణ్యతను పరిశీ లించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రంగారెడ్డిగూడ నుంచి.. నాగర్‌కర్నూల్‌ జిల్లా గుడిపల్లి గట్టు వరకు ఆయన పరిశీలన జరిగింది. వంద కిలోమీటర్ల మేర కాలువల స్థితిగతులను పరిశీలించారు.



 గ్రామస్తుల సమస్యలు వింటూ ముందుకు సాగారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ 160 కి.మీ.మేర విస్తరించి ఉంది. కాలువల వెంట పర్యటించిన ఆయనకు ఆక్వాటెక్‌ బ్రిడ్జి నిర్మాణాలు, యూటీలు, డబుల్‌ లైన్‌ రోడ్డు బ్రిడ్జి, ఓటీల పనులు పెండింగ్‌లో ఉండటం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులకు నీరెలా అందిస్తామని ప్రశ్నించారు. జూలై చివరి నాటికి చివరి ఆయకట్టుకు నీరందించాలని నీటి పారుదల సీఈ ఖగేందర్‌ను ఆదేశించారు.



గుడిపల్లిగట్టు వద్ద కల్వకుర్తి,  అచ్చం పేట నియోజకవర్గాలకు సాగునీరు అం దించడంపై ఉన్నతా ధికారులతో సమీ క్షించారు. 2 నెలల్లో మిగిలిపోయిన పనులను పూర్తిచేసి సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆయన వెంట పంచాయతీరాజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌ గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.



ఏడాదిలోనే ఆర్డీఎస్‌ కాలువల్లో తుమ్మిళ్ల నీళ్లు

సాక్షి, గద్వాల: ఈ ఏడాదిలోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల ను పూర్తిచేసి ఆర్డీఎస్‌ కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని హరీశ్‌రావు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాలలోని అలంపూర్‌ చౌరస్తా మార్కెట్‌ యార్డు కమిటీ చైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడా రు. ఆర్డీఎస్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతోపాటు 3 రిజర్వాయర్లు నిర్మి స్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం 2 లక్షల 13 వేల క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసిందని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వని కంపెనీలపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top