కష్టపడితే అధికారం సాధ్యమే


రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం దూత దిశానిర్దేశం

అన్ని స్థాయిల్లోని నాయకులు 15 రోజులపాటు పోలింగ్‌బూత్‌లకు వెళ్లాలి..

మే 29 నుంచి జూన్‌ 20 మధ్యలో ప్రతి ఒక్కరూ కార్యక్షేత్రంలో పనిచేయాలి

రెండురోజుల పదాధికారుల భేటీలో బీజేపీ నిర్ణయం




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 వేల పోలింగ్‌ బూత్‌ల పరిధిలో పార్టీలోని అన్ని స్థాయిల్లోని నాయకులు 15 రోజుల పాటు పర్యటించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని మండల పార్టీ అధ్యక్షుడి వరకు, కేంద్రమంత్రి మొదలు కుని సర్పంచ్‌ స్థాయి వరకు నాయకులంతా రాష్ట్రంలో మే 29 నుంచి జూన్‌ 20 మధ్య కాలంలో 15 రోజులపాటు ఇంటిని వదిలి గ్రామాలు, పట్టణాల్లో తమకు కేటాయించిన కార్యక్షేత్రాల్లో పనిచేయాలని రాష్ట్ర నాయక త్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్నిస్థాయి ల్లో 8 వేల మంది నాయకులు, కార్యకర్తలను ఎంపిక చేసి వారికి నాలుగేసి చొప్పున పోలింగ్‌ బూత్‌లను అప్పగించనున్నారు. ఈ 15 రోజు లు ఇంటిని విడిచి పూర్తికాలం బయటే గడిపే లా కార్యక్రమాలను రూపొందించుకో వాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది.



గురు వారం సంగారెడ్డిలో ముగిసిన రాష్ట్ర పదాధికా రులు, కార్యవర్గసమావేశంలో ఈ మేరకు ఆయా అంశాలపై చర్చించారు. ఈ సమావేశం లో నిర్ణయించిన ప్రకారం 15 రోజుల పాటు (రోజుకు మూడు పూటల చొప్పున) ఆయా పోలింగ్‌బూత్‌లకు సంబంధించి ఒక్కొక్కరు 45 ఇళ్లలో అల్పాహారం మొదలుకుని మధ్యా హ్న, భోజనం చేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.



కష్టపడి పనిచేయాలి...

తెలంగాణలో పార్టీకి ఉన్న నాయకులు, కార్య కర్తల యంత్రాంగం ద్వారా అధికారంలోకి రావడం కచ్చితంగా సాధ్యమేనని, అయితే అందుకు పార్టీ మొత్తం కదిలి, నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం కష్టపడి పనిచేయాలని అధిష్టా నం దూత, రాష్ట్రపార్టీ ఇన్‌చార్జి సావధాన్‌ సింగ్‌ రాష్ట్ర నాయకులకు ఈ సమావేశాల్లో స్పష్టం చేశారు. ప్రధాని మోదీకున్న మంచిపేరు, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు ఒక్కటే పార్టీని ఏ రాష్ట్రంలోనైనా గెలిపించవని, అందుకు తగ్గట్లుగా సంస్థాగతంగా పార్టీని అన్ని విధాలా బలోపేతం చేసుకోవాలని సూచించారు.



పార్టీ అనుకూలతను ఓటింగ్‌గా మార్పిడి చేసే పోలింగ్‌ బూత్‌స్థాయి యంత్రాంగం లేకపోతే ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టంచేశారు. అందువల్ల రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్‌ బూత్‌లో పార్టీకి ప్రాతినిధ్యం కలిగించే కచ్చితమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇతరపార్టీల నుంచి వచ్చే పెద్ద నాయకులపై ఆశపెట్టుకోకుండా గ్రామస్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top