తెగనున్న భూ‘పంచారుుతీ’


ముకరంపుర : తెలంగాణ ప్రాంత భూముల చిట్టా అంతా నిజాం లెక్కల్లోనే ఉండడంతో చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయి. 30 ఏళ్లకు ఒకసారి చేపట్టాల్సిన భూ రీసర్వే 70 ఏళ్లు గడిచినా అతీగతి లేకపోవడంతో భూములకు అనామతు లెక్కలే ఆధారమయ్యాయి. అప్పటి రికార్డులకు చెదలు పట్టడంతో లెక్కల గుట్టు తెలవకుండా పోరుుంది. ఐదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పెలైట్ ప్రాజెక్టుగా నిజామాబాద్‌లో భూభారతి కార్యక్రమం అమలు చేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రూపొందించినా పాలకుల నిర్లక్ష్యంతో మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం ‘భూభారతి’ కార్యక్రమం ద్వారా భూముల లెక్కలు తేల్చడానికి చర్యలు మొదలుపెట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సర్వేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.



 చినిగిపోయిన టీపన్‌లు

 నైజాం పాలనలో ఒక్కో సర్వే నంబర్‌లో ఉన్న భూ మిని ఒక టీపన్(ఒక సర్వే నంబర్‌లోని భూ వైశాల్యం హద్దులు)గా గుర్తించారు. అప్పుడు జిల్లాలో 6,21,990 టీపన్‌లు ఉండగా 1,63,762 టీపన్‌లు చెదలు పట్టి పోయాయి. దీంతో ప్రస్తుతం అధికారు ల వద్ద 4,58,228 టీపన్‌లు మాత్రమే మిగిలారుు. అందులో సగానికి పైగా ఆనవాళ్లు కనిపించకుండా ఉన్నారుు. ఈ టీపన్ రికార్డులన్నీ 1926-36 మధ్య కాలంలో కాగితపు రికార్డుల్లో నమోదు చేసి ఉండడంతో వాటి భద్రత కష్టంగా మారింది.



నాడు గొలుసులు, దారాలతో చేసిన కొలతలు సక్రమమే అయినప్పటికీ వాటి రికార్డులు భద్రంగా లేకపోవడంతో లెక్కలు తారుమారవుతున్నాయి. భూముల హద్దు లు.. లెక్కలు గందరగోళంగా మారడంతో తగాదాలు పెరిగిపోరుు పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా తయూరైంది. మరోవైపు భూములు అన్యాక్రాంతమై వివాదాలకు కారణమవుతున్నాయి. చాలా మంది బాధితులు భూరికార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.



 వేధిస్తున్న సిబ్బంది కొరత

 జిల్లాలో భూ సర్వే కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత రికార్డులు(టీపన్) ఆధారంగా ఉన్న కొలతలకు ఇప్పుడున్న కొలతలకు పొంతన లేకుండాపోయూరుు. బాధితులు సర్వే కోసం పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. జిల్లాలో 78 మంది సర్వేయర్‌లు అవసరం ఉండగా, 37 మంది మాత్రమే ఉన్నారు. లెసైన్స్‌డ్ సర్వేయర్లు అమాయక రైతుల నుంచి సర్వేల పేరుతో అధిక సొమ్ము దండుకుంటున్నారు.



ప్రభుత్వ సర్వేయర్లు కొలతల కోసం సర్వే నంబర్ల వారీగా రూ.200 నుంచి రూ.400 వరకు తీసుకుంటుండగా లెసైన్స్‌డ్ సర్వేయర్లు ఎకరాలను బట్టి గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాలవారీగా రూ.500 నుంచి రూ.1000 తీసుకోవాలని నిబంధన ఉన్పప్పటికీ ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top