మాటిచ్చి మరిచారు..!


గల్ఫ్ కార్మికుల గోస

 పట్టించుకునేదెవరు?

 ఏడాదైనా మంత్రిత్వ శాఖ

 ఊసేలేదు

 గల్ఫ్‌లో గోస పడుతున్న

 తెలంగాణ కార్మికులు


 

 రాయికల్: ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఉపాధికోసం దుబాయ్, మస్కట్, సౌదీ, కువైట్, బెహరాన్ వంటి దేశాలకు ఉపాధికోసం వలసవెళ్ళాల్సిన అవసరం లేదని, మన రాష్ట్రంలోనే ఉపాధి దొరుకుతుందని, గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక  బడ్జెట్ కేటాయిస్తా..’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉద్యమ నేతగా నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన మాట ఇది. ఆయన ఈ మాట ఇచ్చి ఏడాది దాటిని గల్ఫ్ కార్మికుల గోసను పట్టించుకునేవారే లేకుండా పోయారు. తెలంగాణ నుంచి సుమారు 15లక్షల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం దుబాయ్, అబుదాబీ, షార్జా, మస్కట్, బహ్రెరుున్, ఖత్తర్, సౌదీ అరేబియూ దేశాలకు వలస వెళ్లారు. చాలీచాలనీ వేతనాలతో లక్షలాదిమంది కా ర్మికులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ సారధి గా నేటి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలతో గల్ఫ్ కార్మికులు ఇక తమ వెతలు తీరుతాయని ఆశించారు.  అయితే, టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా.. గల్ఫ్ కార్మికుల గోసను పట్టించుకోవడం లేదు.

 

 పర్యటనలకే పరిమితం..

 గల్ఫ్ బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, చీప్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు వెళ్లినప్పుడు తెలంగాణ కార్మికుల క్యాంపులను సందర్శించారు.  అండగా ఉంటామని భరోసా  ఇచ్చారు. కానీ, సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

 తెలంగాణలో గల్ఫ్ బాధితుల కోసం మంత్రిత్వ శాఖ లేకపోవడంతో వారికష్టాలను పట్టించుకునేవారే లేకుండా పోయారు.  

 

 టీఆర్‌ఎస్ 2014 ఎన్నికల


  మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు

   కేరళ తరహాలోనే ప్రత్యేక

   ప్రవాస భారతీయుల విభాగం ఏర్పాటు చేస్తుంది.

  గల్ప్ దేశాలకు వలస వెళ్తున్నవారి వివరాలను నమోదు చేస్తుంది.

  విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న

   కార్మికుల సంక్షేమం కోసం సత్వరమే

   కేంద్ర ప్రభుత్వం ద్వారా తక్షణ దౌత్య

   చర్యలు చేసే విధంగా ఒత్తిడి చేస్తుంది.

  గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న

     ప్రవాస  కార్మికుల భద్రత, పునరావాసానికి

   ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top