ఆరని చితిమంటలు

ఆరని చితిమంటలు - Sakshi


సౌదీకి వెళ్లిన నెల రోజులకే



 కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన పరుస మల్లయ్య (48) మే తొమ్మిదిన సౌదీలో గుండెనొప్పంటూ కుప్పకూలిపోయి మృతిచెందాడు. మల్లయ్య ఫిబ్రవరిలో అప్పు చేసి సౌదీకి వెళ్లాడు. వెళ్లిన కొంతకాలానికే తీవ్రమైన ఒత్తిడికి గురై చనిపోయాడు. మల్లయ్య శవం గత నెల 28న స్వగ్రామానికి చేరింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. ఇంటి పెద్దను కోల్పోయిన దు:ఖం ఒకవైపు, గల్ఫ్‌కు వెళ్లడానికి చేసిన అప్పు భారం మరొకవైపు, ముగ్గురు పిల్లలను ఎలా పెంచి పోషించాలనేది ఆయన భార్యకు నరకప్రాయంగా మారింది.

 

 ఆరునెలలు గడువకముందే

 మాచారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన మాచర్ల విజయ్‌కుమార్ (27) ఆరు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. గతంలో ఒకసారి రెండేళ్లు దుబాయ్ వెళ్లి వచ్చిన విజయ్‌కుమార్ అప్పులు తీరకపోవడంతో మరోసారి వెళ్లాడు. ఈ నెల నాలుగున ఛాతిలో నొప్పంటూ కుప్పకూలడంతో స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లేలోపు ఆయన మృతిచెందాడు. అతని భార్య కవిత నిండు గర్భిణి. నాలుగేళ్ల ఆదిత్య, రెండేండ్ల సాత్విక్ అనే కొడుకులు ఉన్నారు. ఇద్దరు పిల్లలతో పాటు కడుపున ఉన్న మరో శిశువుతో బతుకు ఎలా ముందుకు నడిచేదని ఆమె రోదిస్తోంది.

 

 కామారెడ్డి : ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌కు వెళ్లేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇక్కడ బతుకుదెరువు లేకనే వారు ఎడారి దేశాల బాట పడుతున్నారు. కారణాలు ఏమైనా పలువురు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. వారి మృతదేహాలు స్వస్థలాలకు రావడం గగనంగా మారుతోంది. ఇక్కడ వారి కుటుంబాల కన్నీళ్లు ధారలై పా రుతున్నారుు. ఆదుకునే వారు లేక, కన్నీరు తెడిచేవారు లేక వారు తల్లడిల్లిపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ వారికి కష్టాలు తప్పడం లేదు. ఇటీవలి కాలంలో గల్ఫ్ దే శాలకు వెళ్లినవారిలో చాలా మంది ఛాతిలో నొప్పం టూ కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు.



పని ఒత్తిడి, అప్పుల భారం, కుటుంబాలకు దూరమయ్యామన్న వేదన వారిని వెంటాడుతోంది. ఇదే ప్రా ణాల మీదకు తెస్తోంది. మరికొందరు రోడ్డు ప్రమాదాలు, తాము పనిచేసే కంపెనీలలో చోటుచేసుకునే సంఘటనలలో ప్రాణాలు కోల్పోతున్నారు. అరుు నా, దుబాయ్, ఓమన్, ఖత్తర్, సౌదీ అరేబియా, బహ్రేయిన్, ఇరాక్ వంటి అరబ్ దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గత యేడా ది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్, రబీ సీజన్లలో పెట్టుబడులు కూడా చేతికి రాలేదు.



దీంతో చాలా మంది ఆర్థికంగా చితికిపోయి తిరిగి గల్ఫ్ బాట పట్టారు. గల్ఫ్ దేశాలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు లక్షన్నర మంది వరకు ఉంటారని అం చనా. బతుకుదె రువు కోసం వెళ్లేవారు వెళుతుండగా, వచ్చేవారు వస్తుంటారు. ఎక్క డా పని దొరకకుంటే అప్పు చేసి ఏదో ఒక ఏజెంటును పట్టుకుని గల్ఫ్‌కు వలసవెళుతున్నారు. అక్కడ అనేక రకాల ఒత్తిళ్లకు లోనవుతూ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పో తుండడంతో వారి కుటుంబాలు అనాథలవుతున్నారుు.



 పన్నెండు రోజులకే

 భిక్కనూరు మండలం రాజంపేట గ్రామానికి చెంది న కొల్మి రాజయ్య (40) ఈనెల 15న సౌదీకి వెళ్లాడు. సౌదీకి వెళ్లిన తరువాత రెండు,మూడు సార్లు మాత్రమే కుటు ంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడా డు. 27న అనారోగ్యంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. రాజయ్య శవం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఒకవైపు, భవిష్యత్తు కానరాని పరిస్థితి మరోవైపు ఆ కుటుంబాన్ని కలవరపెడుతోంది. అప్పులు ఎలా తీర్చేదని, ఎలా బతికేదని భార్య, పిల్లలు రోదిస్తున్నారు.



 దుబాయ్ వెళ్లిన తెల్లవారే

 భిక్కనూరు మండలం అయ్యవారిపల్లికి చెందిన బర్ల లింగం (40) గత మార్చి 24న దుబాయ్‌లో మృతి చెందాడు. అంతకంటే ఒక ్కరోజు ముందే దుబాయ్ వెళ్లాడు. అక్కడికి చేరిన తెల్లారే ఆయన బతుకు తెల్లారిపోయింది. శవం కోసం ఎదురు చూడంగా, ఈ నెల 15న స్వగ్రామానికి చేరింది. శవపేటికపై పడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమకు భవిష్యత్తు లేదని కన్నీరుమున్నీరయ్యారు. ఆయనకు భార్య ఈశ్వరమ్మ, కొడుకు రాజశేఖర్, కూతురు శ్రీయ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top