మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం

మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం - Sakshi


కూసుమంచి: జిల్లాలో వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణంలో భాగంగా పాలేరు, వైరా రిజర్వాయర్లు పరిశీలించేందుకు గురువారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుం ట్ల తారక రామారావు(కేటీఆర్)కు నాయకన్‌గూడెంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్‌ను జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ఇలంబరితి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జడ్పీ చైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ సాదరంగా స్వాగతించారు.



పార్టీ పాలేరు ఇన్‌చార్జి బత్తుల సోమయ్య గజమాలతో సత్కరించారు. ఆర్‌డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, పీఆర్ ఎస్‌ఈ గంగిరెడ్డి, జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్, కూసుమంచి తహశీల్దారు కిషోర్‌కుమార్, ఎంపీడీఓ తిరుపతయ్య మంత్రికి పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం, ఖమ్మం వర కు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు బత్తుల సోమయ్య (పాలేరు), ఆర్‌జేసీ కృష్ణ (ఖమ్మం), బమ్మెర రామ్మూర్తి (మధిర) తదితరులు పాల్గొన్నారు.

 

నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన

ఖమ్మం రూరల్: మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి బైపాస్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్), రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు కిలోమీటర్ దూరం ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రెండుకోట్ల రూపాయలు మంజూరు చేసింది.



కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, జిల్లాపరిషత్ చైర్‌పర్స న్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జడ్పీటీసీ సభ్యురాలు ధరావత్ భారతి, ఎంపీపీ మేళ్లచెరువు లలిత, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు ఎం.నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, ఎండి.ముస్తపా, జిల్లేపల్లి సైదులు, బీమనాదుల అశోక్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మద్ది మల్లారెడ్డి, రామసహాయం బాలక్రిష్ణారెడ్డి, బత్తుల సోమయ్య, ధరావత్ రాంమూర్తి, తేజావత్ పంతులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

ఆటోనగర్ వాసుల వినతి

ఏదులాపురం పంచాయతీ పరిధిలోగల ఆటోనగర్‌లోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానికులు ఆటోనగర్ సంక్షేమ కమిటీ అధ్యక్షుడు గరికపాటి వెంకట్రావు ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రమిచ్చారు. విద్యుత్ లోఓల్టేజీ నివారించాలని, తాగునీటి ఎద్దడి తీర్చాలని, రోడ్లు నిర్మించాలని కోరారు. కలెక్టర్‌ను కలవాలని వారికి మంత్రి సూచించారు.

 ఏదులాపురం, పెదతండా పంచాయతీల్లోని 142 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరుతూ ఎంపీపీ మేళ్లచెరువు లలిత, ఏదులాపురం సర్పంచ్ ధరావత్ సుభద్ర వినతిపత్రమిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top