రంజాన్ ముబారక్

రంజాన్ ముబారక్ - Sakshi


మహబూబ్‌నగర్ అర్బన్: గత 29 రోజులుగా ఉపవాసాలు చేసిన ముస్లింలు రంజాన్ ముగింపు సందర్భంగా మంగళవారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)పండుగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా వేకువజాము నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాలు తదితర ప్రార్థనస్థలాల వద్దకు చేరుకొని ప్రత్యేకప్రార్థనలు చేశారు. కొత్త వస్త్రాలు ధరించిన ముస్లింలు ప్రత్యేక పండుగ నమాజ్‌ను చదివి సర్వమానవాళి  క్షేమం కోరుతూ అల్లాహ్‌ను వేడుకున్నారు. హిందూ, ముస్లింలు పరస్పరం రంజాన్ పండుగ శుభాకాంక్షలు చె ప్పుకున్నారు.

 

 ఆర్థికస్తోమత కలిగిన కొందరు ముస్లింలు ఫిత్రా(దానధర్మాలు)చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లింలకు ఈద్ ముబారక్  తెలిపారు. దీంతో జిల్లాలోని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వానగట్టు వద్దనున్న ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జామియా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా హాఫిజ్ ఇస్మాయిల్ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు.

 

 ప్రముఖుల శుభాకాంక్షలు

 రంజాన్ పవిత్రమాసం అనంతరం మంగళవారం ఈద్‌ఉల్ ఫితర్‌ను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

 కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, మునిసిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా, జేపీఎన్‌సీఈ చైర్మన్ కేఎస్.రవికుమార్, వివిధ పార్టీల నేతలు సత్తూరు రాములుగౌడ్, ఎన్‌పీ వెంకటేశ్, బెనహర్, డీఎస్పీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

 

 భారీ బందోబస్తు..

 రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా కేం ద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రా మాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘట నలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీసులు పహరా కాశారు. పోలీసులు, ఆ శాఖ అధికారులు కూడా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top