హైపవర్‌ కమిటీపై సర్కార్‌ నిర్ణయంతో మరో మలుపు!

Govt Says No To High Power Committee on TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు భావించిన సంగతి తెలిసిందే. సమ్మె సమస్య పరిష్కారానికి ఈ మేరకు జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనిపై మీ నిర్ణయం తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్‌ విముఖత వ్యక్తం చేసింది.

1947 ఇండస్ట్రియల్‌ డిస్‌ప్యూట్‌ యాక్ట్‌ (పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం) ప్రకారం కార్మికులంతా కంపెనీ నిబంధనలకు లోబడి పనిచేయాలని, కానీ ఆర్టీసీ కార్మికులు ఏ చట్టాలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇండస్ట్రియల్‌ డిస్‌ప్యూట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 10 ప్రకారం లేబర్ కమిషన్‌కు ఈ సమ్మె విషయమై ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె లేబర్‌ కోర్టు పరిధిలో ఉందంటూ కోర్టు దృష్టికి తెచ్చింది.

ఆర్టీసీ సమ్మె  పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కమిటీ ఏర్పాటును ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా స్వాగతించారు. అయితే, ప్రభుత్వం ఇందుకు విముఖత చూపడంతో హైకోర్టు ఈ అంశంలో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top