లైఫ్‌ డిజైనర్‌..!

లైఫ్‌ డిజైనర్‌..! - Sakshi


పోచంపల్లి పట్టు చీరలు ఇంకెక్కడా తయారు చేయలేరు. అలాంటి చీరలకు కొత్త డిజైన్లు వేయా లని నిరంతరం ఆలో చిస్తా. రోజుల తర బడి శ్రమించి కొత్త డిజైన్లు తయారు చేస్తా. అందులోనే ఆనందం ఉంది.

    – గంజి మహేష్, చౌటుప్పల్‌



స్వయం కృషి, సృజనాత్మకతను నమ్ముకుని తన జీవితాన్నే కాదు.. మరో వంద మంది జీవితాలను బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడు చౌటుప్పల్‌కు చెందిన గంజి మహేష్‌. తనకు ప్రవేశం ఉన్న వృత్తిని కొత్తకోణంలో చూస్తూ సమాజ పోకడలను అవగాహన చేసుకుని నయా డిజైన్లను సృష్టిస్తున్నాడు.



సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం కలబోతే ఆయన నేసిన పట్టుచీర. నిరంతర తపనతో సాధించుకున్న నైపుణ్యంతో మగువల మనసుదోచే డిజైన్లు వేస్తూ పోచంపల్లి పట్టు చీరలకు ప్రాణం పోస్తున్నాడు. చేనేతకు సరైన చేయూత లభించని సమయం నుంచి నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోకుండా స్వయం కృషితో ఎదిగాడు. పోచంపల్లి పట్టు చీరల శకం ముగిసిందని కొందరు వృత్తిని వీడి ఇతర పనులకు వెళ్తున్నా.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎదురు నిలిచాడు. లీఫ్‌ టూ సిల్క్‌ విధానానికి శ్రీకారం చుట్టి  విజయం దిశగా ముందుకు సాగుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన గంజి మహేష్‌ ఎందరికో స్ఫూర్తి.



కొత్త డిజైన్ల సృష్టికర్త మహేష్‌.. వంద మందికి ఉపాధి

చేనేత కుటుంబంలో పుట్టిన గంజి మహేష్‌ పోచంపల్లి చేనేత టై అండ్‌ డై ఇక్కత్‌ చీరల కొత్త డిజైన్లకు జీవం పోస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహం, ప్రచారంతోపాటు తన మార్కును నిలుపుకున్న పోచంపల్లి పట్టు చీరెలను అత్యంత ఆకర్షణీయంగా, రమణీయంగా కొత్త డిజైన్లతో రూపొందిస్తున్నాడు.



వందమందికి ఉపాధికల్పన

చీరల డిజైన్ల తయా రీలో విభిన్నంగా ఆలోచించే మహేష్‌ చౌటుప్పల్‌ సమీపం లోని న్యాలపట్ల శివారులో రెండేళ్ల క్రితం ఐదు ఎకరాలు కొనుగోలు చేశాడు. అందులో షెడ్‌ నిర్మించి ఆధునిక మగ్గాలు ఏర్పాటు చేసి సుమారు 100 మందికి పని కల్పిస్తున్నాడు.



మల్బరీ సాగు

వృత్తిపైన ఆధారపడి రెండేళ్లలో 20 ఎక రాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇందు లో 8 ఎకరాల్లో మల్బరీ సాగు చేశాడు. పట్టుగూళ్ల పెంపకం ప్రారంభించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా షెడ్‌ నిర్మించాడు. వ్యవసా య భూమిలో సుమారు వంద గొర్రె, మేకలను కొనుగోలు చేసి పెంచుతున్నాడు.



ముడిపట్టు తయారీ ఆలోచన..

కర్ణాటక నుంచి సిదులగట్టు, కోలార్, రాంనగర్, చిక్‌బల్లాపూ ర్‌ల నుంచి తెచ్చుకుంటు న్న ముడి పట్టును ఇక్కడే తయారు చేయాలనేది ఆయన ఆశయం. ఇందు కు అవసరమైన రీలింగ్‌ మిషన్, ట్విస్టింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తే చాలు మల్బరీ ఆకులను తిని పెరిగే పట్టు పురుగుల ద్వారా పట్టును తయారు చేసి.. చీరలు నేసే వరకు ఇక్కడే చేస్తారు. దీంతో మరో 50 మందికి ఉపాధి లభిస్తుంది.





మహేష్‌ తయారు చేసిన చీరలోఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి ,       వరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి

– యాదాద్రి నుంచి యంబ నర్సింహులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top