‘జల’కాల కళకళ

‘జల’కాల కళకళ


 గౌతమీ తీరం భక్తజన సంద్రం

 

 గోదావరి పుష్కరాలు తుది దశకు చేరారుు. నేడు మహాపుష్కరాలకు ముగింపు పలికేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భక్తులు భారీగా తరలిరావచ్చని అంచనా వేస్తున్నారు. పుష్కరాల 11వ రోజు శుక్రవారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భద్రాచలం, పర్ణశాల, మోతె ఘాట్లు కిటకిటలాడారుు. సారపాక యూగశాల నుంచి వైష్ణవ, నాగసాధువులు తరలివచ్చి పుష్కరస్నానం ఆచరించారు. కేసీఆర్ తనయ, నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పుష్కరపూజలు చేశారు. పిండప్రదానాలు, దానధర్మాలు యథాతథంగా కొనసాగారుు. భారీగా తరలివచ్చిన భక్తుల పుణ్యస్నానాలతో గోదావరి తీరం కళకళలాడింది.

 

 భద్రాచలం నుంచి సాక్షి బృందం : గౌతమీ తీరం భక్తజన సంద్రంలా మారింది.. పుష్కర స్నానంతో పుణ్యపలం అందుకోవాలని తరలివచ్చిన భక్తులతో నది పోటెత్తింది. వచ్చిపోయే వాహనాలతో జిల్లా రహదారులు రద్దీగా మారాయి. గోదావరి మహాపుష్కరాలలో భాగంగా 11వ రోజు శుక్రవారం జిల్లాలోని 8 ఘాట్లలో 4.5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కొత్తగూడెం వద్ద ప్రైవేట్ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. ఖ మ్మం నుంచి వస్తున్న వాహనాలను కొత్తగూడెం ప్రకా శం స్టేడియంలో మూడుగంటల పాటు ఉంచారు. ఆ తర్వాత విడతల వారీగా  తరలించారు. భద్రాచలంలోని  ఘాట్లకు అత్యధికంగా 2 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. సారపాక వద్ద ఏర్పాటు చేసిన మోతె ఘాట్, పర్ణశాల ఘాట్‌లో కలిపి రెండు లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు.  



 సాధువుల పుష్కరస్నానాలు..

 సారపాక యాగశాలలో యజ్ఞం నిర్వహిస్తున్న నాగ సాధువులు, వైష్ణవ సాధువులు భద్రాచలం ఘాట్‌లో పుష్కరస్నానం చేశారు. సాధువుల రాకను పురస్కరించుకొని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ ఘాట్‌ను పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. స్నానమనంతరం సాధువులు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం ఈవో కూరాకుల జ్యోతి సాధువులతో కొద్ది సేపు ముచ్చటించింది. యాగశాలలో ఏర్పాట్లు సక్రమంగా లేవని ఈవోకు సాధువులు ఫిర్యాదు చేశారు.



 మోతె ఘాట్‌లో ఎంపీ కవిత పుష్కర పూజలు..

 కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవి త, డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్‌లు తుల ఉమ, గడిపల్లి కవిత, గద్దెల పద్మ, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత బూర్గంపాడు మండలం మోతెఘాట్ లో పుష్కర పూజలు చేశారు. అక్కడ్నుంచి నేరుగా ప ర్ణశాలకు వెళ్లి అక్కడి దేవాలయాన్ని దర్శించుకున్నా రు. తిరిగి భద్రాచలం చేరుకొని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పర్ణశాల ఘాట్‌లో జిల్లా కలెక్టర్ ఇలంబరితి సతీసమేతంగా పుష్కరస్నానం ఆచరించారు. సత్తుపల్లి ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య మణుగూరు మండలం చిన్నరావిగూడెం ఘాట్‌లో పుష్కరస్నానం చేశారు.



 6 అడుగుల మేర పెరిగిన నదీ నీటిమట్టం

 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చర్ల మండలంలోని తాలిపేరుకు భారీగా వరదనీరు చేరింది. ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో 14 గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. సుమారు 6 అడుగుల మేరకు నీటి మట్టం పెరగడం వల్ల ఘాట్ల సమీపం వరకు నీరు వచ్చింది. భక్తులను కొద్ది దూరం మేరకు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top