రాథోడ్ ఒంటెద్దు పోకడలతో అన్యాయం


ఖానాపూర్ : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఒంటెద్దు పోకడలతో పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ ఆకుల శోభారాణి, మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రాము, సత్తన్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ ఆమంద శ్రీనివాస్‌లు ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీ నివాసంలో ఏర్పాటు చేసిన అనుచరులు, నాయకుల సమావేశంలో మాట్లాడారు. గత 15ఏళ్లుగా పార్టీకి ఎన్నోసేవలు చేసి న తమను విస్మరించారన్నారు.



గతంలో అనేక మార్లు కార్యకర్తలు, నాయకులు ప్రజాభిష్టం మేరకు పార్టీ వీడుదామని సూచించినా తమ ఆవేదనను పెడచెవిన పెట్టి ఒంటెద్దు పోకడగా వ్యవహరించారన్నారు. తెలంగాణ వేరుగా మా రిన తరుణంలో ఇంకా సీమాంధ్ర పార్టీలు మనకెందుకని ప్రజలు, కార్యకర్తలు తమను అనేకసార్లు నిలదీశారన్నారు. గతంలో సర్పంచ్, ఎం పీటీసీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని సర్వేలు టీడీపీకి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ సరైననిర్ణయం తీసుకోవడంలో రాథోడ్ విఫలమయ్యారని విమర్శించారు.



దీంతో పార్టీ ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏనాడు కూడా రాజకీయ, ఆర్థిక లబ్ధిచేకూరకపోవగా, పార్టీ తర ఫున పోటీ చేసిన వారంతా రూ.లక్షలు నష్టపోయారన్నారు. దీంతో జిల్లాలో టీడీపీకి ఎంపీ, ఎమ్మెల్యేలు, సహా ఏ పదవి దక్కలేదని, చివర కు తెలంగాణలోనూ ప్రతిపక్ష హోదాను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీపీగా పోటీ చేసేందుకు క్యాంపులో రూ.లక్షలు వెచ్చించిన పార్టీనుంచి చిల్లిగవ్వ ఇవ్వలేదని ఎంపీపీ వాపోయూరు. కేవలం సొంత ఖర్చు, వ్యక్తిగత చరిస్మాతోనే గెలుపొందామన్నారు. తాము పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.

 

ప్రతిపక్ష పార్టీకి ఓటేయించిన ఘనత ఆయనకే

జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో సొంత పార్టీ జెడ్పీటీసీ సభ్యులతో ప్రతిపక్ష పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎన్నికకు ఓటేయించిన ఘనత రాథోడ్ రమేశ్‌కే దక్కుతుందని మాజీ జెడ్పీటీసీ రామునాయక్ ఆరోపించారు. పార్టీలో ఏళ్లుగా పని చేస్తున్న సీనియర్‌లను ఎదగనివ్వకుండా ఎంతోమందిని పక్కనపెట్టి తమ కంటే పార్టీలో చిన్న వయస్సున్న, తన కొడుకు రిథీశ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కుటుంబ పాలనకు తెరలేపారన్నారు. రాథోడ్ రమేశ్ తీరుతోనే జిల్లాలో టీడీపీకి సైతం నష్టం వాటిల్లిందన్నారు. గతంలో మాజీ ఎంపీ అన్నమాటలను గుర్తు చేస్తూ తాను మాత్రం కోట్లకు పడగలెత్తినా ఏనాడు నాయకులు పల్లెత్తుమాట అనలేదని, పార్టీ నాయకులు ఇల్లు నిర్మించుకుంటే మాత్రం పార్టీలో ఉండి లబ్ధిపొందాడనడం సరికాదన్నారు.



విద్యా సంస్థలు, వివిధ కంపెనీలు పెడుతున్నాడని, గత ఎన్నికల్లో సైతం ఇప్పటివరకు తాను, తన కుటుంబం అన్నివిధాల అభివృద్ధి చెందానని, ఇకపై కార్యకర్తల అభివృద్ధికి కృషిచేస్తానని రాథోడ్ స్వయంగా చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాథోడ్ కుటుంబకోసం తాము ఇతర పార్టీల వారందరితో శత్రువులమయ్యామన్నారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలోను తనను వేదికపైకి పిలవకుండా అవమానించి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏ పార్టీకి వెళ్లినా ఆ పార్టీని వెన్నంటే ఉంటూ , పార్టీ సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. తాను ఎన్నికల్లో పోటీచేసినపుడు మన పార్టీకి చెందిన వారే ప్రత్యర్థికి మద్దతు ఇస్తున్న విషయం రాథోడ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సత్తన్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ ఆమంద శ్రీనివాస్ అన్నారు.  



త్వరలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.  వందమంది వరకు టీడీపీకి రాజీనామా చేశారు.  టీడీపీకి రాజీనామా చేసిన వారిలో ఖానాపూర్ ఎంపీపీతోపాటు టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ, సత్తన్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్, ఖానాపూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ ముజీబ్, మస్కాపూర్ సర్పంచ్ గుగ్లావత్ రాజేశ్వరి, లక్ష్మణ్, ఉపసర్పంచ్ లు కొడిమ్యాల వీరేశ్, గణేశ్, టీడీపీ యవత మండల అధ్యక్షుడు షబ్బీర్‌పాషా, పట్టణ అధ్యక్షుడు గోడాపురం సందీప్, వార్డు సభ్యులు సల్ల చంద్రహస్, గోడాపురం గంగాధర్, నారపాక నర్సవ్వ, నర్సయ్య, పోశెట్టి, డెరైక్టర్లు  మాన్క శ్రీనివాస్, బక్కన్న, మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్‌లు మేకర్తి సత్యనారాయణ, చిన్నరాజన్న, నాయకులు గౌరికార్ రాజు, జనార్దన్, రాజేశ్వర్,రమేశ్, అశోక్, లక్ష్మిరాజం, శ్రీనివాస్ తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top