‘మున్సిపల్’కు వాస్తుదోషమా!

‘మున్సిపల్’కు వాస్తుదోషమా! - Sakshi


- మున్సిపాలిటీ కార్యాలయానికి మూఢనమ్మకం బెడద

- కూల్చివేశారు.. వదిలేశారు..

- నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో..?

- కనీస సౌకర్యాలు లేక మహిళా ఉద్యోగుల ఇబ్బందులు

సంగారెడ్డి మున్సిపాలిటీ:
మున్సిపల్‌కు సైతం వాస్తు దోషం పట్టుకుంది. దీంతో కార్యాలయం కుడివైపున ఉన్న గదులను కూల్చి వేశారు. కానీ ఇంత వరకు వాటిని పూర్తి చేయకపోవడంతో కార్యాలయ సిబ్బంది తో పాటు సామాన్యులు సైతం కనీస అవసరాలు తీర్చుకోలేక తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు.



సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీ కార్యాలయంలోని మున్సిపల్ కమిషనర్ చాంబర్ పక్కన (స్టోర్) గదిలో  ఉన్న భవనంతో పాటు మూత్రశాలలను సైతం కూల్చి వేశారు. ఇందుకు కార్యాలయం ఎడమవైపున ఎల్ల మ్మ ఆలయం ఉండటంతో అటు వైపునే మూత్రశాలలు ఉండటం వల్లే కార్యాలయానికి అచ్చిరావడం లేదని కార్మికులు, సిబ్బంది పాలకవర్గం దృష్టికి తీసుకురాగా వాటిని కూల్చివేసి అక్కడ గదులు ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేశారు.



అందుకనుగుణంగా కార్యాలయంలో ఉన్న మరుగుదొడ్లతో పాటు మూత్రశాల లను సైతం కూల్చి వేశారు. దీంతో వైస్ చైర్మన్ అనారోగ్యం పాలుకావడంతో కూల్చిన వాటిని వది లేశారు. ఇప్పటికి గదులను కూల్చి ఐదు నెలలు గడుస్తున్నా ఇంత వరకు వాటిని పూర్తి చేయలేకపోయారు. దీంతో భవన మరమ్మతులను ఎక్కడికక్కడే వదిలేశారు. ఫలితంగా కార్యాలయ సిబ్బంది, సందర్శకులు కనీస వసతులు లేకపోవడంతో మహిళా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కనీసం తాత్కాలిక ఏర్పాట్లయినా చేయలేకపోయారు. ఫలితంగా కార్యాలయ సిబ్బంది ఐదు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.



ఇందుకోసం  కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బస్టాండ్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించినా పనులు పూర్తిచేయలేకపోయారు. మొదటి పాలకవర్గ సమావేశంలో కార్యాలయంలోని గదుల మార్పులకు ఆమోదించారు. కార్యాలయంలో ఉన్న గదులను, మూత్రశాలలను కూల్చివేశారు. వాటి స్థానంలో గోడలు నిర్మించినప్పటికీ అసంపూర్తిగానే వదిలేశారు.

 

వారంరోజుల్లో పూర్తిచేస్తాం..

అనివార్య కారణాల వల్ల మరుగుదొడ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని వాటిని వారం రోజు ల్లో పూర్తిచేస్తాం. కార్యాలయానికి వాస్తు దోషం ఉండటం వల్లనే అంద రి సూచనల మేరకు కూల్చివేయడం జరిగింది. మరమ్మతులు అసంపూర్తిగా ఉన్నాయి.. వాటిని త్వరలో పూర్తిచేస్తాం.

 - మున్సిపల్ చైర్మన్, బొంగుల విజయలక్ష్మి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top