రాజకీయ నిర్ణయమే ఫైనల్‌!

రాజకీయ నిర్ణయమే ఫైనల్‌! - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపో తల పథకం కొత్తదా, పాతదా అనే అంశాన్ని కేంద్ర జలసంఘం తేల్చజాలదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ అధికారం సీడబ్ల్యూసీకి లేదని తేల్చిచెప్పింది. కేవలం తాము సమర్పించిన ప్రాజెక్టు సమగ్ర నివేది కలోని అంశాలపై అభ్యంతరాలుంటే మాత్ర మే చెప్పాలని, వాటిపై వివరణ ఇస్తామని తెలిపింది. ప్రాజెక్టు కొత్తదా, పాతదా అనే అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వా లు చర్చించుకొని రాజకీయ నిర్ణయానికి వస్తాయని, దానికి అనుగుణంగా కేంద్రం ఎలా చెబితే అలా నడుచుకుంటామంది.



 సోమవారం ఈ మేరకు సీడబ్ల్యూసీ ముందు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జరిగిన సమీక్ష సందర్భంగా రాష్ట్రం తన అభిప్రాయా న్ని వెల్లడించినట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ప్రజెంటేషన్‌లో తెలంగాణ లేవ నెత్తిన అనేక అంశాలను సీడబ్ల్యూసీ సభ్యుడు ప్రదీప్‌ కుమార్‌ తప్పుపట్టి నట్లుగా తెలిసింది. ప్రాజెక్టు పూర్తి స్వరూపం, నీటిని తీసు కునే బేసిన్‌ మార్చాక కొత్త ప్రాజెక్టుగానే భావించాల్సి ఉం టుందని ఆయన అడ్డుపడ్డ ట్లుగా సమాచారం. అయితే ఇక్కడే తెలంగాణ గట్టిగా వ్యతిరేకించినట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి.



‘ప్రాజెక్టు కొత్త దా, పాతదా అనేది రెండు తెలుగు రాష్ట్రాలు చర్చించుకొని నిర్ణయానికి వస్తాయి. లేని పక్షంలో కేంద్రం ఈ ప్రాజెక్టుపై తేలుస్తుంది. అంతే తప్ప గోదావరి బోర్డు ద్వారా అనుమ తుల ప్రక్రియ జరగాలని చెప్పజాలరు’ అని పేర్కొన్నాయి. దీంతో తమ అభ్యంతరాల ను లిఖిత పూర్వకంగా తెలియజేస్తామని, వాటిపై సమాధానాలు పంపాక, అను మతు ల అంశమై నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ చెప్పింది. కేబినెట్‌ భేటీ ముగిశాక నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సీఎం కు ఈ అంశమై వివరించినట్టు తెలిసింది. సీడబ్ల్యూసీ లేవనెత్తే అంశాలను పరిశీలించాకే తదుపరి కార్యాచరణ సిద్ధం చేద్దామని కేసీఆర్‌ సూచించినట్లు సమాచారం.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top