‘మిషన్’ను వేగవంతం చేయండి


- చెరువుల అభివృద్ధిలో రైతులు భాగస్వామ్యులు కావాలి

- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

పెద్దేముల్:
చెరువుల అభివృద్ధిలో రైతులు భాగస్వామ్యం కావాలని, మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేయాలని రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలంలోని మదనంతపూర్, కొండాపూర్, రెగొండి, రుక్మాపూర్, తింసాన్‌పల్లి, ఇందొల్, బండపల్లి, మారేపల్లి, ఓగ్లాపూర్ గ్రామాల్లో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలో రూ.99.9 లక్షలతో కాకతీయ మిషన్ కింద మంజురైన పెద్దచెరువు పనులను మంత్రి ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనుల్లో అవకతవకలు జరుగకుండా చుడాలన్నారు. చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు. ప్రతీ రైతు చెరువు మట్టిని వ్యవసాయ పొలాలకు తరలించి, బంగారు తెలంగాణలో బంగారు పంటలను పండించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధికి, రోడ్లకు కోట్ల నిధులు మంజురు చేస్తున్నామన్నారు. వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా తాగునీటికి రూ.25 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. చెరువులు బాగుపడితే పంటలు పండించుకోవడంతోపాటు వలసల నివారణ కూడా అరికట్టవచ్చాన్నారు.



కార్యక్రమంలో ఎంపీపీ శ్రీవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, ఇరిగేషన్ డీఈఈ నవికాంత్, పీఆర్‌డీఈఈ తిరుపతయ్య, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎంసీడీఓ సంధ్య, ఇరిగేషన్ ఏఈ నికేష్, పీఆర్‌ఏఈ చెన్నయ్య, టీఆర్‌ఎస్ నాయకులు ప్రకాశం, మల్లేశం, మండల పార్టీ అధ్యక్షుడు నర్సిములు, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, పెద్దేముల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రమేష్. అంజిల్‌రెడ్డి, విజయకుమార్, బాల ప్ప, గోవర్ధన్‌రెడ్డి, లింగేష్, కృష్ణాగౌడ్, ఎంపీటీసీ స భ్యులు, సర్పంచ్‌లు లాజర్, విద్యాసాగర్, లక్ష్మణ్, పద్మ, విజయ, తదితర నాయకులు పాల్గొన్నారు.



- చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

మండల కేంద్రంలో మహేంద్రన్న యువసేన ఆధ్వర్యంలో యువసేన అధ్యక్షుడు అన్వర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇలాంటి పనులు చేయటం చాలా మంచిదన్నారు. అన్వర్‌ను మంత్రి అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top