పురుగు మందు కాదు.. తెల్లటి ద్రావకం


 చిమ్మపుడి (రఘునాధపాలెం): తమకు నకిలీ పురుగు మందు కట్టబెట్టారంటూ చిమ్మపుడి రైతులు ఆగ్రహోదగ్రుల య్యూరు. ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధిని నిలేశారు. ఈ మందును రసాయనిక పరీక్షకు పంపుతామని వ్యవసాయూధికారి హామీ ఇవ్వడంతో శాంతించారు.



ఈ గ్రామ రైతుల కథనం ప్రకారం...

 తన మిరప తోటకు బయోపెస్టిసైడ్ మం దును పిచికారి చేస్తే పురుగు తగ్గి  మొక్క దండి గా పెరుగుతుందని చిమ్మపుడి రైతు కోటేరు నర్సిరెడ్డి ఆశపడ్డాడు. ఈ నెల 22న ఖమ్మం లోని శ్వేత పెస్టిసైడ్స్‌లో 240 ఎంఎల్ బాటిల్ పురుగు మందు బాటిళ్లు రెండింటిని ఒకొక్కటి 2,500 రూపాయల చొప్పున కొన్నాడు. దానిని సోమవారం ఉదయం తోటకు పిచికారి చేయడానికి సిద్ధమయ్యాడు. బాటిల్ మూత తీయగానే లోపల తెల్లటి ద్రవం కనిపించింది. నెల రోజుల కిందట కొన్న ఇదే మందుకు, దీనికి తేడా ఉండడాన్ని గమనించాడు. తన తోటి రైతులకు ఈ మందును చూపించాడు.



ఈ మందు నాణ్యతపై వారందరికీ అనుమానం కలిగింది. దానిని అమ్మిన దుకాణాదారుడికి వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పారు. కొద్దిసేపటి తరువాత ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధి శ్రావణ్ వచ్చాడు. పురుగు మందు రెండో బాటిల్ మూతను రైతులు తెరిచి అతనికి చూపించారు. అందులో కూడా మందు తెల్లటి ద్రావకంగా ఉంది. ఈ తేడాను ఆ ప్రతినిధి అంగీకరించి, ‘‘బ్యాచ్ మారి ఉండవచ్చు’’ అని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆ రైతులు.. సరైన సమాధానం చెప్పేదాకా కదలనిచ్చేది లేదంటూ ఐదు గంటలపాటు గ్రామ సెంటర్‌లో ఉంచారు.



సమాచారముందుకున్న మండల వ్యవసాయ శాఖాధికారిణి అరుణ వచ్చి, ఆ మందును పరిశీలించారు. ఈ మందు నాణ్యతపై ఆమె కూడా అనుమానం వ్యక్తం చేశారు. దీనిని పరీక్షకు పంపుతామని చెప్పి, రైతు కోటేరు నర్సిరెడ్డి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కొన్ని రోజుల కిందట ఇదే మందును 150 ఎకరాల్లోలోని మిరప తోటలకు పిచికారి చేసినట్టు గ్రామ రైతులు చెప్పారు. తాము కూడా మోసపోరుునట్టేనని వారు భయూందోళన వ్యక్తం చేశారు.



 ఈ మందు నాణ్యతపై వ్యవసాయ శాఖాధికారిణి అరుణను వివరణ కోరగా... రైతుల ఫిర్యాదుతో మందును పరిశీలించినట్టు చెప్పా రు. ఈ మందు కల్తీ జరిగిందా, అనే విషయూ న్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. దీనికి పరీక్షకు పంపుతామని, నివేదిక వచ్చాక ఏ విషయం తె లుస్తుందని అన్నారు. ఒకవేళ నకిలీదని తేలితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని, వారి ఆదేశాలకనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top