భద్రాద్రిలో దొంగనోట్లు


భద్రాచలం:  భద్రాచలంలో దొంగ నోట్ల చెలామణి పెరిగింది. ప్రతి రోజు ఏదో ఒకచోట దొంగ నోట్లు బయటపడుతుండటంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



  పట్టణంలోని యూబీ రోడ్డులోగల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు జమ చేసేందుకుగాను మంగళవారం ఓ ఖాతాదారుడు వెళ్లాడు. అతడు ఇచ్చిన నగదులతో 500 రూపాయల నోటు ఒకటి నకిలీదిగా బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆ విషయూన్ని ఖాతాదారుడికి చెప్పి చింపివేశారు. ఈ ఖాతాదారుడు యూబీ రోడ్‌లో ప్రముఖ వ్యాపారస్తుడు. తనకు గతంలో ఎన్నడూ ఇలా నకిలీ నోటు రాలేదని, మొదటిసారిగా మోసపోయానని ‘సాక్షి’తో అన్నారు.



  రెండు రోజుల కిందట పాత మార్కెట్ సెంటర్‌లో రోజువారీ కూరగాయల వ్యాపారి వద్దకు 100 రూపాయల నకిలీ నోటు కనిపించింది. - 100, 500, 1000 రూపాయల దొంగ నోట్లు భద్రాచలం పట్టణంలో పెద్దఎత్తున చెలామణి అవుతున్నాయి. వీటిని ముద్రించి, చెలామణి చేస్తున్న ముఠాను ఇటీవల భద్రాచలం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. అరుునప్పటికీ వీటి చెలామణికి మాత్రం అడ్డుకట్ట పడలేదు.



  దొంగ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న కుక్కునూరు మండలానికి చెందిన ముఠా ఇటీవల పట్టుబడింది. వారు ముద్రించిన నోట్లే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయా..? లేక, ఇంకెవరైనా ఈ దొంగ నోట్లు ముద్రిస్తున్నారా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.



  తెలంగాణ-ఆంధ్ర, తెలంగాణ-ఒడిస్సా రాష్ట్రాలకు సరిహద్దున భద్రాచలం ఉంది. ఆయా రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాలకు వాణిజ్య కేంద్రం కూడా ఇదే. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో, సంతల్లో వ్యాపారాలు చేసే వారు ఇక్కడి నుంచే సరుకులు తీసుకెళ్తుంటారు. గతంలో కూడా భద్రాచలంలో పెద్ద మొత్తంలో దొంగ నోట్లు పట్టుబడ్డాయి. వీటన్నిటినిబట్టి, దొంగ నోట్ల తయూరీదారులు వాటి చెలామణికి భద్రాచలాన్ని కేంద్రంగా ఎంచుకుని ఉండవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నారుు.



  భద్రాచలంలోని కొంతమంది బడా వ్యాపారులకు, దొంగ నోట్ల చలామణి చేస్తున్న ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. దొంగ నోట్ల ముఠా లావాదేవీల విషయంలోనే గతంలో భద్రాచలం టౌన్ స్టేషన్‌లోని ఓ యువ ఎస్సై ఉద్యోగం కోల్పోయూరు.



  భద్రాచలంలో వెలుగులోకి వస్తున్న నకిలీ దందాలు ఇక్కడి పోలీసులకు కూడా మచ్చ తెస్తున్నారుు. కొన్నాళ్ల కిందట ఇక్కడి వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. వాస్తవానికి భద్రాచలంలో దాదాపు 30మంది వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు. పోలీసులు కేవలం ఏడుగురు వ్యాపారులపై మాత్రమే కేసులు నమోదు చేశారు. మిగతా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిలో ఏదో ‘మతలబు’ జరిగిందని ఇటీవల వరకు చర్చ సాగింది. దీనంతటిపై ఎస్పీ దృష్టి సారించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top