శ్రమ..దిగ్భ్రమ


రైతుల శ్రమ గాలుల పాలవుతోంది. పిడుగు పాట్లు అకాలమృత్యువును ఆహ్వానిస్తున్నాయి. వెరసి పల్లెలు వణికి పోతున్నాయి. శుక్రవారం జిల్లాలోని ఖిల్లాఘనపురం, అడ్డాకుల, పెద్దకొత్తపల్లి, కోస్గి, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో వీచిన ఈదురు గాలులకు మామిడి తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కురిసిన వర్షానికి వరిపంట నేలకూలి కోత దశలో అన్నదాతలకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆరుగాలం శ్రమ కళ్లెదుటే దెబ్బతినడంతో కర్షకులు గుండెలవిశేలా రోదిస్తున్నారు. అప్పులు చేసి పంట పండిస్తే ఇలా పెనుగాలులు ఈడ్చుకు పోతుండడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆదుకోవాలని ఆశగా చూస్తున్నారు.      

 

 

 కోస్గి/నవాబ్‌పేట/ఖిల్లాఘనపురం/    హన్వాడ, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగడ్లతో కూడిన అకాల వర్షం కురిసింది. వర్షానికి మామిడి చెట్ల పూతతో పాటు, కాయలు, పిందెలు, వరిగింజలు నేలరాలాయి. మామిడి కాపును, వరిపంటలను నమ్ముకున్న రైతులు భారీగా నష్టపోయారు.

 

 

 కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం, దేవునితిర్మలాపూర్, వెన్నచర్ల, సాతాపూర్, మారెడుమాన్‌దిన్నె, పెద్దకారుపాముల, దేదినేనిపల్లి, వెన్నచర్ల, చంద్రకల్, కల్వకోల్, చెన్నపురావుపల్లి గ్రామాల్లో సుమారు 1200 ఎకరాల్లో వరి పంట వడగండ్ల వర్షానికి దెబ్బతింది. అలాగే కోస్గి మండలం  హన్మాన్‌పల్లి గ్రామంలో 35 ఎకరాలు, కడంపల్లిలో 60 ఎకరాలు, బోగారంలో 30 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. ఖిల్లాఘనపురం మండలం ఘట్టుకాడిపల్లి, పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి, అల్లమాయపల్లి, మానాజీపేట గ్రామాల్లో 150 ఎకరాల్లో పంటనష్టంజరిగింది.

 

 గట్టుకాడిపల్లిలో ఆంజనేయులకు చెందిన రూ.30వేల  కాడెద్దు మృతిచెందగా, తహశీల్దార్ కార్యాలయం, వెలుగు కార్యాలయంలోని చెట్లు విరిగి పడ్డారుు. ఆయూ గ్రామాల్లో విక్రయూనికి సిద్ధంగా ఉన్న ఇటుకభట్టీలు తడిసి ముద్దరుు లక్షల్లో నష్టం వాటిల్లింది. నవాబుపేట మండలం కామారం, కేశవరావుపల్లి, పోమాల్ గ్రామాల్లోని 200 ఎకరాల వరి పంట వడగండ్ల వర్షానికి దెబ్బతింది. ముఖ్యంగా కొత్తకోట మండలంలో 60 ఎకరాల మామిడి తోటలు, వెయ్యి ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. కొన్నూర్, నిర్వేన్, పాలెం, కానాయపల్లి, కనిమెట్ట, అమడబాకుల గ్రామాల రైతులు అధికమొత్తంలో నష్టపోయూరు. ఒక్కొక్కరు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి అకాల వర్షంతో నష్టపోవాల్సి వచ్చింది. కొందుర్గు మండలం గాలిగూడ, పెద్దఎల్కిచర్ల, వీరన్నపేట, పద్మారం, చేగిరెడ్డిఘనాపూర్‌గ్రామా ల్లో వరి, కూరగాయల పంటలు వర్షం తాకిడికి పూర్తిగా దెబ్బతిన్నారుు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో విచారణ చేపట్టి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

 

 హన్వాడలో కుండపోత వర్షం

 హన్వాడ మండలంలో శుక్రవారం సాయంత్రం గంటన్నరపాటు కుండపోత వర్షం కురిసింది. బుద్దారం, నాయినోనిపల్లి, సల్లోనిపల్లి, టంకర, పెద్దర్పల్లి, ఇబ్రహీంబాద్, మాదారం గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురడంతో ఒడ్లు నేలరాలగా, పలుచోట్ల బందాల్లో వేసిన వరి మెదళ్లు తడిచిపోయాయి. నాగంబాయితండాలో విద్యుత్‌తీగలు తెగిపడి మాన్యానాయక్‌కు చెందిన గేదె చనిపోరుుంది. అలాగే మండల శివారులోని ఇటుక భట్టీలు తడిచిముద్దయ్యాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top