‘మూగ’ వేదన..!

‘మూగ’ వేదన..!


నల్లగొండ అగ్రికల్చర్‌ : సరైన వైద్యం అందక మూగజీవాలు ఘోషిస్తున్నాయి. జిల్లాలోని పశువైద్య కేంద్రాల్లో డాక్టర్లు, కంపౌం డర్లు, సిబ్బంది, మందుల కొరత వేధిస్తోంది. దీంతో పశువైద్యం కుంటుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది తమ పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు ఇతర జీవాలకు నాటు వైద్యంతోనే సరిపుచ్చుకుంటున్నారు. ఇటు వైద్యం అందకపోగా.. అటు తెలిసీతెలియని నాటు వైద్యంతో మూగజీవాలు తల్లడిల్లుతున్నాయి. జి ల్లాలో 5.30 లక్షల పశువులు, 7,90, 063 గేదెలు, 9లక్షల 60 వేల గొర్రెలు, 1,20,700 మేకలు, 22లక్షల కోళ్లు ఉన్నాయి. వీటికి ఏదైనా వ్యాధి సోకితే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, సరైన మందులను సరఫరా చేయకుండా పశు సంవర్థక శాఖపై చిన్నచూపుచూస్తోంది.



వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువగా ఉంటుం ది. ఈ పరిస్థితుల్లో మూగజీవాలకు వైద్యం అందని దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ పశువైద్య కేంద్రాల్లో చాలాచోట్ల జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్లు లేకపోవడంతో పశువులకు సరైన వైద్యం అందడం లేదు. గ్రామాల్లో పశువైద్య కేంద్రాలు ఉన్నప్పటికీ సిబ్బంది, మందులు కొరత కారణంగా నిరుపయోగంగా ఉంటున్నాయి. దీనికి తోడు జిల్లాలో గొర్రెల యూనిట్ల పంపిణీకి గొర్రెల కొనుగోలుకు పశువైద్యులు ఇతర జిల్లాల్లో పర్యటిస్తుండడంతో.. మూగజీవాలకు వైద్యం అందడంలేదు.



 ఉన్న కాస్త సిబ్బంది విధులకు డుమ్మాలు కొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్యం అం దించాల్సిన డాక్లర్లు, సిబ్బంది జిల్లా కేంద్రంలో నివాసముంటూ తమ ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పలువురు వైద్యులు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారనే ఆరో పణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతా ల్లో పనిచేయాల్సిన వైద్యులు జిల్లా కార్యాలయంలో పనిచేయడం ఏంటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.



అరకొర సిబ్బంది..

నల్లగొండలో బహుళార్థక పశువైద్యశా ల, 7 తాలూకా పశువైద్య శాలలు, 56 మండల పశువైద్య కేంద్రాలు, 61 గ్రా మీణ పశువైద్య కేంద్రాలు పని చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడీ స్థాయి పోస్టులు 4, పశువైద్యులు 1, ఇతర పారామెడికల్‌ సిబ్బంది 26 పోస్టులు, అటెండర్‌లు 5  కలిసి  36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల పశువైద్య కేంద్రాల్లో డాక్టర్లు లేకపోవడంతో సిబ్బందితోనే సేవలందిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top