కళాశాల జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ‘అల్లరి’ నరేష్
హైదరాబాద్: కళాశాల జీవితం ఎంతో ముఖ్యమైందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని జీవితంలో మంచి స్థాయిలో స్థిర పడాలని సీని హీరో అల్లరి నరేష్ సూచించారు. నగరంలోని బాచుపల్లిలో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు అల్లరి నరేష్ శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కుచిపూడి, బైక్ విన్యాసాలు అబ్బుర పరిచాయి.