ప్రతిభకు పదును


కందుకూరు(రంగారెడ్డి జిల్లా): సౌరశక్తితో నడిచే ద్విచక్ర వాహనాన్ని తయారు చేసి ఔరా అనిపించారు మండలంలోని లేమూరు పరిధిలోని నిషితా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు. ఆ కళాశాలకు చెందిన మెకానికల్ ఫైనలియర్ విద్యార్థులు సుదర్శన్, విశ్వ, వెంకటసాయినాథ్, భానుప్రసాద్, శివకుమార్‌రెడ్డి రూ.40 వేల ఖర్చుతో.. సౌర పలకలతో సౌరశక్తిని గ్రహించి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో నడిచే ద్విచక్ర వాహనాన్ని రూపొందించి గురువారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వినయ్‌కుమార్, డెరైక్టర్ విజయ్‌కుమార్, డీన్ పూజా, హెచ్‌ఓడీ నాగార్జున, సీనియర్ లెక్చరర్ రామ్‌దాస్ తదితరులు విద్యార్థులను అభినందించారు. నూతన టెక్నాలజీని కనుగొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top