పోరు ప్రశాంతం

పోరు ప్రశాంతం


- 4 సర్పంచ్...27 వార్డు స్థానాలకు ఎన్నికలు

- 2 ఎంపీటీసీ స్థానాలకు కూడా..

- రెండు వార్డుల ఎన్నిక వాయిదా

- సైనాల, డీసీ తండా పంచాయతీ ఎన్నికలు సైతం..

వరంగల్ అర్బన్ : 
జిల్లాలో 4 సర్పంచ్, 27 వార్డు స్థానాలకు శనివారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం విజేతలకు అధికారులు గెలుపుపత్రాలు అందజేశారు. జిల్లాలో మొత్తం 7 పంచాయతీలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చినా.. నెల్లికుదురు మండలం  సైనాల, వర్ధన్నపేట మండలం డీసీ తండాకు నామినేషన్లు రాని కారణంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది.



ములుగు మండలం పోట్లాపూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదేవిధంగా 29 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. గీసుకొండ మండలంలోని రెండు వార్డులకు గుర్తుల కేటాయింపులో జరిగిన పొరపాట్ల వల్ల అక్కడ కూడా ఎన్నికలు ఈనెల 9కి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ప్రకటింది. తొలి ారిగా జిల్లాలో మూడు పంచాయతీలకు ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు.

 

విజేతలు వీరే...

వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపల్లి సర్పంచ్‌గా ఆదెపు దయాకర్,స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నష్కల్ సర్పంచ్‌గా నంగునూరి రాధిక, చేర్యాల మండలం తాడూరు సర్పంచ్‌గా నర్రపద్మ, నర్సంపేట మండలం కమ్మపల్లి సర్పంచ్‌గా అజ్మీర విజయ ఎన్నికయ్యారు.

 

వార్డుల విజేతలు

గొడవటూరు పంచాయతీ(10వ వార్డు) బుర్రలక్ష్మి, బాన్జీపేట(9)చెట్ల బాబు, నిడిగొండ(6) మైలారపు స్వరూప, చౌటపల్లి(11)దామెర లచ్చమ్మ, విసునూరు(7)లకావత్ బిక్షం, తోరనాల(6)రచ్చ బాలలక్ష్మి,కొత్తూరు(10)గాదె కౌసల్య, వడ్డేకొత్తపల్లి(4)సాయిబాబు, పంతిని(7)శాన రాజమణి,ఒంటిమామిడిపల్లి(1)గాజు కొమురమల్లు,(2)మజ్జిగ శారద,(3)అప్సర భేగం,(4)ఎండీ.రఫీ,(6)మజ్జిగ రాములు,(7) అద్దెంకి సంధ్య,(8)ఏసీరెడ్డి ర జిత, (10)కె.రాజు, నైనాల(5)కొండపల్లి స్మిత, దాట్ల(7)బాషపంగు మహేందర్, పెరుమాండ్ల సంకీస(5)కిన్నెర బాబు, బుధరావుపేట(13)గుగులోత్ నీలమ్మ,తండా ధర్మారం(5)గుగులోత్ ధాని, సాదిరెడ్డిపల్లి(10) వాసం పావని, మాధవపురం(9)గుగులోత్ భద్రు, జంగాలపల్లి(3) సానబోయిన స్వాతి, బుద్దారం(4)గడ్డం మహేందర్, సుబ్బక్కపల్లి(2) సముద్రాల రాజయ్యఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు.



కేశిరెడ్డిపల్లి, ఊరట్టంలోఎంపీటీసీ..

బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నిక శనివారం ప్రశాంతంగా ముగిసింది. 76.7 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదానందం, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రమాదేవి తెలిపారు. 1846 ఓట్లకు గాను, సాయంత్రం 5 గంటల వరకు 1417 ఓట్లు పోలైనాయన్నారు.  ఈ నెల6న స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎస్‌ఎసై తాడ్వారుు మండలంలోని ఊరట్టం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 76 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2315 ఓట్లకు 1770 ఓట్లు పోలయ్యూరు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top