విద్య సామాజీకరణ కావాలి


కేయూ క్యాంపస్ : విద్య అనేది సామాజీకరణ కావాలని, ఇందుకు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయూలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్‌హాల్‌లో ‘సమాజ వికాసం- సమాన విద్య’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో సమానత్వం సాధ్యం కాదనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో సామాజిక అసమానతలు, సంపదలు పెంచడంలో ప్రభావం కనబర్చిందన్నారు. అసమానతలు లేనిదే అభివృద్ధి జరగదనే పాలకుల వాదనకు వ్యతిరేకంగా సమాన విద్య రావాలంటే నిరంతర సమగ్రమైన, విశ్వాసవంతమైన చర్చతోనే సాధ్యమన్నారు.



వ్యక్తి, సమాజానికి సంబంధాలను విడగొట్టేందుకు విద్య ఒక అంశంగా ఉపయోగిస్తూ అంతరాన్ని సృష్టిస్తున్నారని, ఇందులో ఉన్నత విద్య మరింత నిర్లక్ష్యానికి గురై దారుణంగా తయూరైందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభు త్వ విద్యారంగానికి నిధులు గతంలో కంటే 2 శాతం తగ్గించడం సరికాదన్నారు. దీనివల్ల యూనివర్సిటీలకు సరైన నిధులు వచ్చే పరిస్థితి ఉండబోదన్నారు. సంపన్నులకు పన్ను రద్దు చేయడం వారికి మేలు చేకూర్చేందుకు నిర్ణరుుంచడం శోచనీయమన్నారు. సమసమా జ స్థాపనే లక్ష్యంగా విద్య ఉండాలన్నారు. ఇది ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారానే సాధ్యమవుతుందన్నారు.



ఆలిండియూ ఫోరం ఫర్ రైట్‌టూ ఎడ్యుకేషన్ సెక్రటరీ రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ విద్యా వ్యాపారాన్ని నిషేధించి కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. బ్యాంకులను జాతీయం చేసినట్లుగానే ప్రైవేట్ విద్యా సంస్థలను కూడా ప్రభుత్వపరం చేయూలన్నారు. పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు అభినవ్ మాట్లాడుతూ విద్యకు, పనికి లంకె ఉండేట్లుగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సదస్సులో పలు అంశాలపై చర్చించడంతోపాటు విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలు కూడా ప్రస్తావించారు.



రెండో దశలో ప్లస్-2 విద్య ప్రభుత్వ పరిధిలోకి, మూడో దశలో ఉన్నత విద్యను ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. చర్చాగోష్టిలో పలు తీర్మానాలు చేశారు. పాఠశాల నుంచి కళాశాల స్థారుు వరకు విద్య ప్రభుత్వపరంగా అందజేయూలని, ఏ రూపంలో ఉన్నా ప్రైవేటీకరణను నిషేధించాలని, దశలవారీగా అన్ని రకాల విద్యను ప్రభుత్వపరంగా చేయూలని తీర్మానించారు. కేయూ ప్రొఫెసర్ కె.కాత్యాయనీ విద్మహే, సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యూకేషన్ సంస్థ బాధ్యులు ఎడమ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ మార్క శంకర్‌నారాయణ, బైరి సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ఆ సంస్థ రూపొందించిన వెబ్‌సైట్‌ను హరగోపాల్ ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top