వైఎస్ పాలనలోనే గ్రామస్వరాజ్యం

వైఎస్ పాలనలోనే గ్రామస్వరాజ్యం - Sakshi


స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలి

 

మహబూబ్‌నగర్ అర్బన్:  నేటికీ స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు సమానంగా దక్కడం లేదని, మహానేత వైఎస్ పాలనలోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అమలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ పాలకపక్షాల ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే సంక్షేమ పథకాలు బడుగు, బలహీనవర్గాల దరికి చేరడం లేదన్నారు.



ప్రపంచీకరణ, సరళీకృత సంస్కరణల వల్ల పేదలు మరింత దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ రంగం ముసుగులో దేశ సంపద దోపిడీకి గురవుతున్నదని, దేశానికి వెన్నెముక అయిన రైతాంగానికి సరైన ప్రోత్సాహం లేక నిరాశ చెందుతున్నదని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న త రాలకు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ పథకం పేరిట గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు.



అన్ని రంగాలకు ఆర్థిక వనరులు కల్పించి గ్రామ పంచాయతీలను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కిందని.. ఆయన మరణానంతరం స్థానిక  సంస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి, రాజ్యంగ విలువలను కాపాడే రీతిలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి భీమయ్యగౌడ్, నాయకులు జెట్టి రాజశేఖర్, పుల్లయ్యశెట్టి, మహ్మద్ హైదర్‌అలీ, ఇందిర, అతీఖుర్ రహెమాన్, మహ్మద్ ఇసాఖ్, పీటర్, శ్రీకాంత్‌రెడ్డి, కలీం, ఇక్రం హుసేన్, అహ్మద్ యమని, సర్దార్, గోవర్దన్, రాజు, కేశవులు, నారాయణ, విజయ్, రఘునాథ్, చింటూ, గురు, మధు, ముస్తాఖ్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top