వంద నోటుకు ఎన్ని వంకలో..


హన్మకొండ : వరంగల్ జిల్లా నర్సంపేట ఎస్‌బీహెచ్ ఏటీఎంలో వింత వంద నోటు వచ్చింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డ్రైవర్‌గా పని చేస్తున్న లైన్ వెంకటేశ్వర్లు బుధవారం నర్సంపేటలోని ఎస్‌బీహెచ్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయగా, అందులో ఈ వంద నోటు వచ్చింది. దీనికి రెండు సిరీస్ నంబర్లు ఉన్నాయని, 4యూఎల్ 266626, 4యూఎల్ 266726 నంబర్లు ముద్రించి ఉన్నాయని చెప్పాడు. ముద్రణలో లోపం వల్ల ఇలా వచ్చినట్లుంద ని తెలిపాడు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top