దప్పిక తీరాలంటే.. ఊరు దాటాల్సిందే

దప్పిక తీరాలంటే..  ఊరు దాటాల్సిందే


అడుగంటుతున్న భూగర్భ జలాలు

పనిచేయని చేతిపంపులు

వ్యవసాయ బావులే దిక్కు

గ్రామాలు,తండాల్లో అరిగోస

 


వేసవి   రానేలేదు.. అప్పుడే పాని‘పాట్లు’.. బోరుబావులు, నల్లాల, ట్యాంకర్ల వద్ద సిగపట్లు..! బావులు, చెరువులు, వాగులు, వంకలు వట్టిపోయూరుు..  ట్యాంకులు నీటిచుక్క అందించక నిలువెత్తు ఉత్సవ విగ్రహాల్లా మిగిలారుు.. తండా, గూడేలు, పల్లెవాసులు మైళ్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.. అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుని నీటి గోస తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.. -

కేసముద్రం : మండలంలోని మహముద్‌పట్నం శివారు కాలనీతండావాసులు నీటి కోసం పక్క ఊరికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ సుమారు 250 కుటుంబాలున్నారుు. బావిలో నీళ్లు అడుగంటారుు. రెండు బోరింగ్‌లలో ఉప్పు నీళ్లు వస్తున్నారుు. దీంతో మూడు కిలోమీటర్లలోని కేసముద్రం దర్గా వద్ద బోరింగ్‌ను ఆశ్రరుుస్తున్నారు. బావిలో పూడికతీయూలన్న స్థానికుల విజ్ఞప్తిని పట్టించుకోని  ప్రజాప్రతినిధులు, అధికారులు పైప్‌లైన్ వేయడం గమనార్హం.  

 

 

పాలకుర్తి/దేవరుప్పుల : మండలంలో 22 గ్రామాలు 45 గిరిజన తండాలున్నాయి. చెన్నూరులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ప్రైవేటు వ్యవసాయ బోరును అద్దెకు తీసుకుని తాగు నీరందిస్తున్నారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకును నిర్మించి 17 ఏళ్లు కావస్తున్నా వినియోగంలోకి రావడం లేదు.



బమ్మెర పరిధిలోని దుబ్బతండా, ఎల్లమ్మ గడ్డ తండాలో, గూడూరు గ్రామ శివారు కిష్టపురం తండా, ముత్తారం గ్రామ శివారు తండాల్లో తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వల్మిడి, శాతపురం గ్రామం, తండాల్లో గుక్కెడు నీరు కరువవుతోంది.  దేవరుప్పుల మండలం ధర్మాపురం, మాదాపురం, ధారావత్‌తండా పంచాయతీ  పరిధి తండాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీర్మాల, కడవెండిలో

 తాగునీటి వనరులున్నా.. తరచూ బోర్లు మరమ్మతుకు వస్తున్నారుు.

 

పని చేయని నీటి ట్యాంకులు

 

ఏటూరునాగారం : ఏజెన్సీలో చెలిమె నీరే దిక్కవుతోంది. చెల్పాక, అల్లంవారి ఘణపురం ప్రజలు దయ్యాలవాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. నల్లాలు, నీటి ట్యాంకులు నిరుపయోగంగా మారింది. చెల్పాకలో నీటిట్యాంక్‌కు మోటారు అమర్చలేదు. అల్లంవారిఘణపురంలో ట్యాంక్, నల్లాలు అమర్చినా మోటారు, కనెక్షన్ ఇవ్వలేదు. 19 గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలోని 32 చేతిపంపులు మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఐటీడీఏ పరిధిలోని నీటి ట్యాంకులేవీ పనిచేయట్లేదు.  

 

 హసన్‌పర్తి: బల్దియాలో విలీనమైన హసన్‌పర్తి, హన్మకొండలో 29 గ్రామాలు, మరో 10గ్రామాలకు సమీకృత నీటిని సరఫరా చేస్తున్న డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోయాయి. భీమారంలోని పుట్టలమ్మ డీ ఫ్లోరైడ్, హసన్‌పర్తిలోని చౌదరికుంట, ఆరెపల్లిలోని డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేదు. మానేరు నుంచి నీరు విడుదలైతేనే.. ఈ ప్రాజెక్టులు నిండేది. ఆగస్టులోనే ఓ దఫా నీరు విడుదలైంది. ప్రస్తుతం మూడు నెలలుగ రిజర్వాయర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. సుమారు 1.50లక్షల మంది ఈ ప్రాజెక్టులపై ఆధారపడి ఉన్నారు. ప్రాజెక్టు నిర్మించిన 18 ఏళ్లలో చుక్క నీరు లేని పరిస్థితి రావడం ఇదే తొలిసారి.  హసన్‌పర్తిలోని యాదవనగర్, వంగపహాడ్, దేవన్నపేటల్లో నీటి ట్యాంకులు శిథిలావస్థకు చేరారుు.

 

ఊన్యాతండా గోడు..

 

నర్సింహులపేట : కొమ్ములవంచ శివారు ఊన్యాతండాలో గిరిజనులు నెలల తరబడి నీటి కష్టాలు పడుతున్నారు. తండాలో 50 కుటుంబాలున్నారుు. తాగునీటి బావి ఎండిపోరుుంది. మూడు బోరింగ్‌లు అడుగంటారుు. స్థానికులు రాత్రీపగలు తేడా లేకుండా కరెంటు ఎప్పుడొస్తే అప్పుడు వ్యవసాయ బావుల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. కరెంటు ఎప్పుడొస్తదో తెలియట్లేదని, పనులు మానుకొని నీటి కోసం ఇంటి వద్దే ఉంటున్నామని తండావాసులు పేర్కొంటున్నారు. బీల్యాతండా, మధుతండా, రూప్లాతండాలోనూ నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కాగా, వారంలోగా అద్దె బావుల ద్వారా నీరందిస్తామని ఏఈ సూర్యనాయక్ తెలిపారు.

 

ఎండిన బావులు..


 

దుగ్గొండి : చాపలబండలోని బావిలో 20 మీటర్ల లోతులోనూ చుక్క నీరు లేదు. రేబల్లెలో మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. నాచినపల్లిలో సగం జనాభాకు ఆధారమైన బావిలో నీటి మట్టం తగ్గింది. నాలుగు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. జనం వ్యవసాయ బావులను ఆశ్రరుుస్తున్నారు. బావుల్లో నీరు లేక రేబల్లె, కేశవాపురం, గోపాలపురంలో ఓవర్‌హెడ్‌ట్యాంక్‌లు నిరుపయోగంగా ఉన్నాయి. మండలంలో నేటికీ 24 బావులు ఎండిపోయూరుు. 41 బోరు బావులు పనిచేయడం లేదు.  63 చేతిపంపులు మరమ్మతు కోసం నిరీక్షిస్తున్నారుు.  

 

ఆర్నెల్లుగా ఇదే గోస

 

 ఆర్నెల్ల సంది నీటి కోసం శానా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. బావి, మూడు బోరింగ్‌లు ఎండిపోయాయి. దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటూ అరిగోస పడుతున్నాం.  

 - జాటోతు లచ్చమ్మ, ఊన్యాతండా

 

నాలుగు రోజులకోసారి నీళ్లు

 

పరకాల : నాగారంలోని రెండు బావుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో నాలుగు రోజులకోసారి నల్లా నీళ్లు వస్తున్నారుు. నడికూడలో నాలుగు బావులకు అదనంగా మరో బావిని అద్దెకు తీసుకున్నా.. నాలుగు రోజులకోసారే నీటి సరఫరా సాధ్యమవుతోంది. కంఠాత్మకూరులో రెండు బావులుండగా రెండు గంటలకు మించి నీరు రావడం లేదు. చర్లపల్లి, ముస్త్యాలపల్లిలోనూ ఇదే పరిస్థితి. పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజిపేటలో చేతిపంపు వద్ద మహిళలు బిందెలతో బారులు తీరుతున్నారు.

 

ప్రణాళికలు రూపొందించని అధికారులు

 

హన్మకొండ: తాగునీటి ముప్పు ముంచుకొస్తున్నా.. అధికార యంత్రాంగంలో చలనం లేదు. నీటి ఎద్దడి నివారణకు  నెలాఖరులోగా ప్రణాళికలు రూపొందించాలని ఈ నెల 19న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సభ్యులు సూచించారు. నేటికీ ఆర్‌డబ్ల్యూఎస్ ఈ దిశగా పని ప్రారంభించలేదు. మరో రెండు నెలల్లో భూగర్భ జలాలు మరింత పడిపోనున్నాయి. గ్రిడ్ పేరుతో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 18,295 చేతిపంపులు, 2155 రక్షిత మంచినీటి సరఫరా పథకాలున్నాయి. తాగునీటి సమస్య పరిష్కారానికి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధుల కింది 253 పనులు మంజూరయ్యూరుు. వీటిలో 87 పనులు కొనసాగుతుండగా, 118 పనులు పూర్తయ్యాయి. 48 పనులు మొదలు కాలేదు. టీఎఫ్‌సీ నిధుల ద్వారా 97 పనులు మంజూరు కాగా 31 పనులు మొదలు పెట్టలేదు. 42 పనులు కొనసాగుతుండగా 24 పనులు పూర్తయ్యాయి. టీఎఫ్‌సీ గిరిజన  సంక్షేమశాఖ ద్వారా మూడు పనులు మంజూరు కాగా నేటికీ మొదలు పెట్టలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చినా మూడు రకాల నిధుల కింద మొత్తం 353 పనులు మంజూరు కాగా ఇప్పటికే 82 పనులు మొదలు పెట్టలేదంటే అధికారుల చిత్తశుద్ధి అర్థమవుతోంది!  

 

సర్పంచ్‌కూ తిప్పలే..



 చిత్రంలో కనిపిస్తున్న మహిళ పరకాల మండలం రాజిపేట సర్పంచ్ తూర్పాటి ఎల్లమ్మ. గ్రామంలో పక్షం రోజుల క్రితమే బావులు వట్టిపోయూరుు. బోర్లు పనిచేయడం లేదు. నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచి తీసుకొచ్చుకుంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చేది వేసవి కాలం. మరి ఎలా ఉంటుందో తల్చుకుంటే భయమేస్తుంది అని తెలిపింది. సర్కారోళ్లు రెండు బోర్లు, ఒక బావి వేరుుంచాలని కోరుతోంది.

 



 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top